Advertisement

విప్లవ నాయకుడిగా మారబోతున్న ఎన్టీఆర్‌

Posted : May 10, 2021 at 12:58 pm IST by ManaTeluguMovies

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ను చేస్తున్నాడు. గత రెండున్నర సంవత్సరాలుగా ఎన్టీఆర్ ఆ సినిమాకే పరిమితం అయ్యాడు. ఎట్టకేలకు సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఒకటి రెండు నెలల్లో ఆర్ ఆర్‌ ఆర్‌ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్‌ తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యారు. త్రివిక్రమ్‌ తో ఎన్టీఆర్‌30 ఉన్నా ఆ ప్రాజెక్ట్‌ క్యాన్సిల్‌ అయ్యింది. దాంతో కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ తర్వాత మళ్లీ చేసేందుకు సిద్దం అయ్యాడు.

జనతా గ్యారేజ్‌ సినిమాలో ఎన్టీఆర్‌ ను ఒక నాయకుడిగా చూపించిన కొరటాల శివ త్వరలో చేయబోతున్న సినిమాలో విప్లవ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆచార్య సినిమాలో చిరంజీవిని ఎలా అయితే విప్లవ నాయకుడిగా కనిపించబోతున్నాడో తెల్సిందే. ఇప్పుడు ఎన్టీఆర్‌ కూడా అలాంటి పాత్రలోనే కనిపిస్తాడని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ను విప్లవ నాయకుడిగా చూపించేందుకు కొరటాల కథను సిద్దం చేశాడని సమాచారం. ఆచార్య మరియు ఆర్‌ ఆర్‌ ఆర్‌ ముగిసిన తర్వాత ఎన్టీఆర్‌ 30 కొరటాల శివ దర్శకత్వంలో మొదలు అవ్వబోతుంది.


Advertisement

Recent Random Post:

Jr.NTR’s Awareness Video On Drugs : డ్రగ్స్ పై పోరాటానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు | Devara

Posted : September 25, 2024 at 12:40 pm IST by ManaTeluguMovies

Jr.NTR’s Awareness Video On Drugs : డ్రగ్స్ పై పోరాటానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు | Devara

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad