Advertisement

తమిళ దర్శకుడు శంకర్ కు మాతృవియోగం..!

Posted : May 18, 2021 at 7:20 pm IST by ManaTeluguMovies

సౌత్ ఇండియన్ టాప్ డైరక్టర్, ప్రముఖ తమిళ సినీ దర్శకుడు శంకర్ కు మాతృవియోగం కలిగింది. శంకర్ మాతృమూర్తి ఎస్.ముత్తులక్ష్మి ఈరోజు ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతూ స్వగృహంలోనే కన్నుమూశారు. శంకర్ కు తల్లితో ఎంతో అనుబంధం ఉంది. తాను జాతీయస్థాయి దర్శకుడిగా ఎదగడంలో తన తల్లి పాత్ర ఎంతో ఉందని శంకర్ పలు ఇంటర్వ్యల్లో చెప్పేవారు.

శంకర్ కు మాతృవియోగం కలిగిందనే వార్త ఆయన అభిమానులను కలవరానికి గురి చేసింది. ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన అభిమానులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ హీరోగా భారతీయుడు2 తెరకెక్కిస్తున్నారు. త్వరలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా, రణవీర్ సింగ్ హీరోగా మరో సినిమా చేయనున్నారు.


Advertisement

Recent Random Post:

Emakku Thozhil Romance – Teaser | Ashok Selvan, Avantika Mishra | Nivas K Prasanna | Balaji Kesavan

Posted : April 24, 2024 at 8:32 pm IST by ManaTeluguMovies

Emakku Thozhil Romance – Teaser | Ashok Selvan, Avantika Mishra | Nivas K Prasanna | Balaji Kesavan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement