ఇటీవల కాలంలో సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మృతి చెందుతున్నారు. ఎంతో మంది ఇండస్ట్రీ వర్గాల వారికి కన్నీరు మిగుల్చూతు తుది శ్వాస విడుస్తున్నారు. ప్రతి రోజు ఎవరిదో ఒకరిది మృతికి సంబంధించిన వార్త వినాల్సి వస్తూనే ఉంది. పలువురు సినీ టెక్నీషియన్స్ మృతి చెందుతున్న ఈ సమయంలో మరో వ్యక్తి కూడా కన్ను మూశారు. ఆయనే గాయకుడు కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏవీఎన్ మూర్తి.
సీనియర్ గాయకుడిగా ఎన్నో పాటలు పాడి అలరించిన ఏవీఎన్ మూర్తి 83 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. దాదాపుగా 45 ఏళ్ల పాటు డబ్బింగ్ రంగంలో కొనసాగాడు. 100 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాడు. ఇతర భాషల సినిమాలకు ఈయన డబ్బింగ్ చెప్పడం జరిగింది. పలు టీవీ మరియు రేడియో వాణిజ్య ప్రకటనలకు కూడా తన వాయిస్ ను అందించారు. ఇండస్ట్రీలో చాలా మందికి సుపరిచితుడు అయిన ఏవీఎన్ మూర్తి మృతి దిగ్బ్రాంతిని కలుగజేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా ద్వారా పలువురు స్పందించారు.