Advertisement

ముంబైలో భారీ బంగ్లాను కొనుగోలు చేసిన అజయ్ దేవగన్

Posted : May 31, 2021 at 5:57 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ టాప్ హీరో అజయ్ దేవగన్ ముంబైలో భారీ ఆస్తిని సొంతం చేసుకున్నాడు. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఈ బంగ్లా 5310 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని విలువ దాదాపు 60 కోట్ల రూపాయలు విలువ ఉంటుందని అంచనా. బాలీవుడ్ వర్గాల్లో ఈ వార్తలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి.

అజయ్ దేవగన్ ఏడాది కాలం నుండి ముంబైలో ప్రాపెర్టీ కొనుగోలు చేయాలని చూస్తున్నాడు. అజయ్ దేవగన్ ఈ బంగ్లా కొనుగోలు చేసిన విషయాన్ని అజయ్ ప్రతినిధి ధృవీకరించాడు. అయితే ఎంత పెట్టి కొన్నది చెప్పకపోయినా రియల్ ఎస్టేట్ వర్గాల సమాచారం ప్రకారం 60 కోట్లపైనే ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం అజయ్ దేవగన్ వరసగా సినిమాలు చేస్తున్నాడు. సూర్యవంశీ, గంగూభాయ్ కతీయవాడి, ఆర్ ఆర్ ఆర్, మైదాన్, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, థాంక్స్ గాడ్, మే డే సినిమాల్లో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. మే డే కు నిర్మాత, దర్శకుడు అజయ్ దేవగన్ కావడం విశేషం.


Advertisement

Recent Random Post:

Mega Prince Varun Tej Speech | Matka Pre Release Event | Karuna Kumar | Meenakshi Chaudhary

Posted : November 11, 2024 at 2:11 pm IST by ManaTeluguMovies

Mega Prince Varun Tej Speech | Matka Pre Release Event | Karuna Kumar | Meenakshi Chaudhary

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad