Advertisement

బాహుబలి 2 కోసం 2500.. ఆదిపురుష్‌కు 8000

Posted : June 13, 2021 at 5:25 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 లో 2500 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాకు కూడా అన్ని వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్ ను వినియోగించింది లేదు. ఎంతటి పెద్ద సినిమా అయినా కూడా రెండే వేల లోపు వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్ తోనే చేయడం జరిగింది. కాని ఇప్పుడు రూపొందుతున్న ఆదిపురుష్‌ ఏకంగా 8000 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్ తో దర్శకుడు ఓమ్‌ రౌత్ ప్లాన్‌ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

బాహుబలి 2 కు మూడు రెట్లు అదనంగా ఆదిపురుష్‌ లో వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉండబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది విజువల్ వండర్ గా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌ విషయంలో కూడా బాహుబలి ని మించి ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ కోసం ఏకంగా సంవత్సర కాలం పాటు కొన్ని వందల మంది వర్క్‌ చేయబోతున్నారు. మోషన్‌ గ్రాఫిక్స్ ను కూడా ఈ సినిమాలో దర్శకుడు ఇండియన్‌ సినీ ప్రేమికులకు పరిచయం చేయబోతున్నాడు. ప్రభాస్‌ రాముడిగా కృతి సనన్ సీత దేవిగా లంకేశ్వరుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టుకు ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

BGMI x KALKI 2898 AD Trailer | Enter A New World | Prabhas, Amitabh, KamalHasan, Deepika, Nag Ashwin

Posted : June 24, 2024 at 8:29 pm IST by ManaTeluguMovies

BGMI x KALKI 2898 AD Trailer | Enter A New World | Prabhas, Amitabh, KamalHasan, Deepika, Nag Ashwin

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement