Advertisement

RRR: సెట్ లో అడుగుపెట్టిన సీతారామరాజు..!

Posted : June 21, 2021 at 12:10 pm IST by ManaTeluguMovies

ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ”ఆర్.ఆర్.ఆర్”. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి 10 శాతం మాత్రమే పెండింగ్ వర్క్ ఉంది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో నిలిచిపోయిన ఈ సినిమా చిత్రీకరణను సోమవారం హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించారు. స్ట్రిక్ట్ గా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చరణ్ కోసం ముంబై నుంచి వచ్చిన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ కన్ఫర్మ్ చేశారు.

”లాక్ డౌన్ 2.0 ఎత్తివేసిన తర్వాత హైదరాబాద్ లో సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. మనందరి ఫేవరేట్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న RRR కోసం రామ్ చరణ్ కు హెయిర్ స్టైల్ చేయడం ద్వారా నా డే స్టార్ట్ అయింది” అని అలీమ్ హకీమ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చరణ్ తో దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి తారక్ ఎప్పుడు సెట్స్ లో అడుగుపెడతాడో తెలియాల్సి ఉంది. ఇకపోతే జూలై 1 నుంచి హీరోయిన్ అలియా భట్ కూడా షూట్ లో జాయిన్ కానుందని సమాచారం. ఈ క్రమంలో చెర్రీ – అలియా లపై ఓ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ‘ఆర్.ఆర్ ఆర్’ లో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్ – సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే RRR సినిమా విడుదలపై స్పష్టత రానుంది.


Advertisement

Recent Random Post:

Introducing Shiva Shakti – Odela 2 | Tamannaah | Sampath Nandi | Ajaneesh Loknath | Ashok Teja

Posted : April 26, 2024 at 5:59 pm IST by ManaTeluguMovies

Introducing Shiva Shakti – Odela 2 | Tamannaah | Sampath Nandi | Ajaneesh Loknath | Ashok Teja

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement