Advertisement

పిక్ టాక్: అందం హిందోళం.. అధరం తాంబూలం!

Posted : June 21, 2021 at 12:26 pm IST by ManaTeluguMovies

దక్షిణాది స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా.. ఏం తింటుందో కానీ రోజురోజుకి మరింత అందంగా తయారవుతుంది. ఈ పాలబుగ్గల సుందరి ఈ మధ్య సినిమా వార్తలకంటే న్యూ ఫోటోషూట్స్ వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నిజానికి ఇన్నేళ్లు గడిచినా తమన్నా సోయగం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ప్రారంభం నుండి ఇప్పటికి అమ్మడు అదే నాజూకు సోయగం మెయింటైన్ చేస్తోంది. అందుకే ఇండస్ట్రీలో పదిహేనేళ్లు దాటినా అభిమానులకు కలలరాణిగా వెలిగిపోతుంది. ఎన్ని భాషలలో ట్రై చేసినా తమన్నా స్టార్డం మాత్రం తెలుగులోనే అందుకుంది. అందుకే ఈ బ్యూటీ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా వెంటనే ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది.

వాస్తవానికి అందాన్ని మించిన అందం అంటే తమన్నాదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మేనిఛాయలో వయ్యారి నాజూకుతనం చూస్తేనే ఫిట్నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్ధమవుతుంది. తమన్నా డెడికేషన్ గురించి ఇప్పటివరకు చాలానే విన్నాం. పాత్రకోసం డైటింగ్ చేస్తూ క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తోంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే కఠోర వ్యాయమసాధన చేస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్నా పోస్ట్ చేసిన న్యూ ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో మిల్కీ బ్యూటీని చూస్తే తన మేనికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఆ మధ్యలో లావుగా మారింది కానీ మళ్లీ నాజూకుగా తయారై అందరికి ట్రీట్ ఇస్తుంది.

లేటెస్ట్ ఫోటోలో తమన్నా మిల్కీ అందాన్ని వైట్ షర్ట్ లో బంధించి కెమెరా ముందుంచింది. ఆ కళ్లు.. హెయిర్ స్టైలు.. ఆ మెరిసే ఒళ్ళు.. అబ్బబ్బా చూస్తేనే కుర్రకారు నరాలు జివ్వుమంటున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అంటే అంతలా ఆరాధిస్తున్నారు అమ్మడి అందాన్ని. అలా కూర్చొని థైస్ కనిపించేలా పోజివ్వటంలోనే ఫుల్ మార్కులు కొట్టేసింది. మరి ఇంత అందానికి సోషల్ మీడియాలో కూడా అదే రేంజి ఫాలోయర్స్ ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస ప్రాజెక్ట్ లతో ఖాళీలేకుండా ఉంటోంది. తమన్నా లేటెస్ట్ పిక్ చూసి నేటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే తమన్నా నటించిన సీటిమార్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమాతో పాటు ప్రస్తుతం ఆది మహాలక్ష్మి.. గుర్తుందా శీతాకాలం.. మాస్ట్రో.. బోలె చుడియన్ సినిమాలు చేస్తోంది. మాస్ట్రోతో ఫస్ట్ టైం బోల్డ్ రొమాంటిక్ రోల్ లో కనిపించనుంది. అలాగే త్వరలో మాస్టర్ చెఫ్ అనే టీవీ షోను హోస్ట్ చేయనుంది.


Advertisement

Recent Random Post:

ఏపీ రూపురేఖలు మార్చిన నవరత్నాలు | CM YS Jagan | AP ELECTIONS 2024

Posted : May 2, 2024 at 2:05 pm IST by ManaTeluguMovies

ఏపీ రూపురేఖలు మార్చిన నవరత్నాలు | CM YS Jagan | AP ELECTIONS 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement