ఒక స్థాయికి వెళ్లిన తర్వాత వద్దంటే డబ్బు వస్తుందని అంటారు. ఇప్పుడు ప్రియాంక చోప్ర పరిస్థితి అలాగే ఉంది. ఆమె సినిమాలు చేస్తే కోట్లలో పారితోషికం ఉంటుంది. ఇక ఆమె యాడ్స్ లో నటిస్తే కోట్ల పారితోషికాలు ఇచ్చేందుకు కంపెనీలు సిద్దంగా ఉన్నాయి. అలాంటిది సోషల్ మీడియాలో ఒక్క యాడ్ పోస్ట్ చేస్తే ఆమెకు ఏకంగా మూడు కోట్ల పారితోషికంను ఇచ్చేందుకు మార్కెట్ వర్గాలు సిద్దంగా ఉన్నాయి. ఆమె ను ఎక్కువగా అమెరికన్స్ ఫాలో అవుతున్నారను. కనుక ఈ భారీ మొత్తం ఇచ్చేందుకు కంపెనీలు సిద్దంగా ఉన్నాయి.
ఇన్ స్టా గ్రామ్ లో ప్రియాంక చోప్రాకు 6.5 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. బాలీవుడ్ లో ఏ స్టార్ కు ఈ స్థాయిలో ఫాలో వర్స్ లేరు. అంతటి ఫాలోవర్స్ సంఖ్య ఉన్నందుకు గాను ఈ అమ్మడికి ఏకంగా 3 కోట్ల రూపాయల పారితోషికంను ఒక్క యాడ్ కు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇతర బాలీవుడ్ హీరోయిన్స్ పది నుండి యాబై లక్షల వరకు ఒక్కో యాడ్ కు పారితోషికంగా తీసుకుంటూ ఉంటారు. కొందరు లక్ష నుండి రెండు మూడు లక్షల పారితోషికం కూడా అందుకుంటూ ఉంటారు. మొత్తానికి యాడ్ పోస్ట్ లతో సెలబ్రెటీలు కోట్లు సంపాదించడం విడ్డూరంగా ఉందంటున్నారు.