Advertisement

మళ్లీ బాలయ్య వెంట పడుతున్నాడా?

Posted : July 11, 2021 at 12:04 pm IST by ManaTeluguMovies

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో బాలకృష్ణ కు కథ చెప్పి ఈజీగా ఒప్పించవచ్చు అనేది కొందరి మాట. ఆయన మంచి కమర్షియల్ వ్యాల్యూస్ తో ఇంట్రెస్టింగ్ గా కథ చెప్తే వెంటనే నటించేందుకు ఓకే అంటాడట. సినిమా కథ బాగా చెప్పిన దర్శకులు కొందరు ఆ తర్వాత సినిమాను అంతే బాగ తీయడంలో విఫలం అయ్యారు. దాంతో బాలయ్యకు పరాజయాలు తప్పలేదు. బాలయ్యతో గతంలో సినిమాలు చేసి ప్లాప్ అయినా కూడా మళ్లీ మళ్లీ వారికి అవకాశాలు ఇవ్వడం అనేది చేస్తూనే ఉంటాడు. ఆయన నుండి వచ్చే సినిమాల్లో ఎక్కువ శాతం దర్శకులను రిపీట్ చేసినవే ఉంటున్నాయి.

ప్రస్తుతం చేస్తున్న అఖండ సినిమా దర్శకుడు బోయపాటితో ఇది మూడవ సారి వర్క్ చేయడం అనే విషయం తెల్సిందే. కథలు నచ్చాలే కాని ఆయన గతంలో ప్లాప్ ఇచ్చిన దర్శకులతో కూడా డేర్ గా సినిమాలు చేస్తాడు. ఇక బాలయ్యతో గతంలో డిక్టేటర్ వంటి డిజాస్టర్ ను తెరకెక్కించిన శ్రీవాస్ మరో ప్రయత్నం చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న అఖండ సినిమా తర్వాత చేయబోతున్న గోపీచంద్ మలినేని సినిమాల తర్వాత డిక్టేటర్ డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

2016 లో బాలయ్యతో డిక్టేటర్ సినిమాను తెరకెక్కించిన శ్రీవాస్ 2018 లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సాక్ష్యం సినిమాను తెరకెక్కించాడు. మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ బాలయ్యతోనే శ్రీవాస్ సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడని అంటున్నారు. ఇటీవలే ఈయనకు ఓకే చెప్పిన బాలయ్య వచ్చే ఏడాది ఆరంభంలో డేట్లు ఇచ్చేందుకు ఓకే కూడా చెప్పాడని వార్తలు వస్తున్నాయి. శ్రీవాస్ ఈసారి పక్కా కమర్షియల్ కథతో మాస్ ఎలిమెంట్స్ ను జోడించి సినిమాను తెరకెక్కించి బాలయ్య అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా ఆయన్ను చూపించబోతున్నాడట. తనకు రెండవ అవకాశం ఇచ్చిన బాలయ్య కు శ్రీవాస్ సక్సెస్ ను కట్టబెట్టేనా అనేది చూడాలి.


Advertisement

Recent Random Post:

ఢిల్లీలో కుండపోత… స్తంభించిన జనజీవనం | Heavy Rains In Delhi

Posted : June 28, 2024 at 12:15 pm IST by ManaTeluguMovies

ఢిల్లీలో కుండపోత… స్తంభించిన జనజీవనం | Heavy Rains In Delhi

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement