Advertisement

ఓటీటీలోనే రిలీజ్.. నారప్ప విసిరిన బిగ్ బాంబ్

Posted : July 11, 2021 at 9:26 pm IST by ManaTeluguMovies

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన `నారప్ప` రిలీజ్ విషయంలో సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారా? లేక నేరుగా థియేటర్లో రిలీజ్ చేస్తారా? అన్నదానిపై సస్పెన్ప్ కొనసాగుతోంది. దీనిపై చిత్ర నిర్మాత సురేష్ బాబు ఇంకా సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఎగ్జిబిటర్లు థియేటర్లలోనే అగ్ర హీరోల చిత్రాలన్ని రిలీజ్ చేయాలని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఫిలింఛాంబర్ ఆ మేరకు అల్టిమేటమ్ జారీ చేసింది. నిర్మాతలంతా అక్టోబర్ చివరి వరకూ వేచి చూడాలని ఆ తర్వాతే స్వేచ్ఛగా ఓటీటీల్లో రిలీజ్ చేసుకునేందుకు ఛాంబర్ అనుమతిస్తుందని వార్నింగ్ ఇవ్వడం సంచలనమైంది.

అయితే ఈ చిత్రాన్ని ఇప్పటికే ఓటీటీకి అమ్మేసినట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ సినిమా ప్రచార కార్యక్రమాల్ని తిరిగి ప్రారంభించింది. దీనిలో భాగంగా నారప్ప చిత్రం అమెజాన్ లో ఎక్స్ క్లూజివ్ రిలీజ్ అంటూ ప్రకటన విడుదలైంది.

దీంతో నారప్ప రిలీజ్ ఓటీటీలోనే అంటూ ప్రచారం ఠారెత్తిపోతుంది. ఈ సినిమా తొలి లిరికల్ సాంగ్ ను కూడా రిలీజ్ చేసారు. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ తేదీ కూడా వారంలో అధికారికంగా బయటకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. మరి ఈ సందిగ్ధతకు తెర పడాలంటే సురేష్ బాబు అధికారికంగా స్నందిస్తే కానీ క్లారిటీ రాదు. ఇంతకీ నారప్పను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు వెంకీ- సురేష్ బాబు ముందుకొచ్చారని ఇన్నాళ్లు సాగిన ప్రచారమంతా ఉత్తుత్తేనా? అంటూ ఇప్పుడు సరికొత్త చర్చ వేడెక్కిస్తోంది.


Advertisement

Recent Random Post:

HariHaraVeeraMallu Part 1: Sword vs Spirit – Teaser | Pawan Kalyan | MM Keeravaani | AM Rathnam

Posted : May 2, 2024 at 2:34 pm IST by ManaTeluguMovies

HariHaraVeeraMallu Part 1: Sword vs Spirit – Teaser | Pawan Kalyan | MM Keeravaani | AM Rathnam

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement