Advertisement

ఒకే సారి కోటిన్నర పెంచేసిన కృతి శెట్టి

Posted : July 17, 2021 at 11:21 am IST by ManaTeluguMovies

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాకు గాను కృతి శెట్టి తీసుకున్న పారితోషికం ఇరవై లక్షలకు లోపే అనేది టాక్. ఇక ఉప్పెన సినిమా సెన్షేషనల్‌ సక్సెస్‌ అవ్వడంతో కృతి శెట్టి పారితోషికం భారీగా పెరిగి పోయింది. ఉప్పెన రిలీజ్ కు ముందు రామ్‌ సినిమాకు గాను ఈమె ఎంపిక అయ్యింది. అప్పటికే మంచి క్రేజ్ ఉన్న కారణంగా ఈమె 50 లక్షల పారితోషికం డిమాండ్‌ చేసింది. ఆమెకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఆ పారితోషికంకు ఓకే అన్నారు. ఇక తదుపరి సినిమాకు గాను ఆమె కోటిన్నర డిమాండ్‌ చేస్తుందట.

ఉప్పెన రిలీజ్ కు ముందు వరకు ఆమె రేంజ్ చాలా సాదారణం. కాని ఇప్పుడు ఆమె ఒక స్టార్. అందుకే నాగచైతన్యకు జోడీగా బంగార్రాజు సినిమాలో నటించేందుకు గాను ఆమెను సంప్రదించగా ఏకంగా రెండు కోట్ల రూపాయల పారితోషికంను డిమాండ్‌ చేశారు అంటూ టాక్ వినిపిస్తుంది. సీనియర్‌ స్టార్‌ హీరోయిన్స్ రేంజ్ లో ఈ అమ్మడు పారితోషికం వసూళ్లు చేస్తున్న నేపథ్యంలో ముందు ముందు ఈమెతో సినిమా అంటే కష్టమే అన్నట్లుగా నిర్మాతలు భావిస్తున్నారట. కోటి వరకు పెంచితే పర్వాలేదు కాని మరీ రెండు కోట్లు ఏంటీ అమ్మడు అంటూ నెటిజన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

AP Politics : తునిలో టీడీపీకి షాక్ | Yanamala Krishnudu Joining in YSRCP

Posted : April 26, 2024 at 1:51 pm IST by ManaTeluguMovies

AP Politics : తునిలో టీడీపీకి షాక్ | Yanamala Krishnudu Joining in YSRCP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement