ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొన్నాళ్లుగా ఆశావాహులు ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్ట్ లను భర్తీ చేశాడు. మొత్తం 135 నామినేటెడ్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల ప్రకటించారు. ఆయన మొత్తం జాబితాను మీడియాకు విడుదల చేశారు. కొత్తగా ఎంపిక అయిన వారికి అభినందనలు తెలియజేయడంతో పాటు వారు పార్టీ కోసం కృషి చేసినందుకు గాను మంచి గుర్తింపు అన్నట్లుగా వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ నామినేటెడ్ పదవుల్లో అత్యధికులు మహిళలు ఉండటం చెప్పుకోదగ్గ విషయం.
మొత్తం 135 నామినేటెడ్ పోస్ట్ ల్లో 68 మహిళలకు మరియు 67 పురుషులకు కేటాయించడం జరిగింది. 50 శాతం కంటే ఎక్కువగా మహిళలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం అభినందనీయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలు మరియు రాజకీయ ప్రాముఖ్యత ఇంకా పలు విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ పోస్టులకు ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం ఉన్నంత కాలం వీరు ఉంటారు. మద్యలో కొందరిని తప్పించడం లేదా కొన్ని స్థానాల్లో కొత్తవారిని పెట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి.