Advertisement

జాన్వీ వర్సెస్ అర్జున్.. అన్నా చెల్లెళ్ల హంగామా!

Posted : August 9, 2021 at 7:14 pm IST by ManaTeluguMovies

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ గ్లామర్ ఎలివేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. సందర్భాన్ని బట్టి బికినీ స్విమ్ సూట్ దేనికైనా రెడీ. ఇక స్పెషల్ నంబర్లలో మోహిని అవతారంతో చెలరేగిపోతుంది. కొన్నిసార్లు క్యూట్ అండ్ లవ్ లీ లుక్స్ తోనూ ఆకట్టుకుంటుంది. తాజాగా బ్రదర్ అర్జున్ కపూర్ తో కలిసి దిగిన ఓ డీసెంట్ ఫోటోషూట్ ని ఇన్ స్టా లో షేర్ చేసింది. ఇది ప్రఖ్యాత హార్పర్ బజార్ కవర్ పేజీ ఫోటోషూట్.

అందులో అన్నా చెల్లెళ్లు ఇద్దరు వైట్ కలర్ డ్రెస్సులు ధరించారు. అర్జున్ కపూర్ కుర్చీలో కూర్చుని ఫన్నీ లుక్ లో ఫోజ్ ఇవ్వగా..జాన్వీ సోఫాలో కుర్చొని రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది. స్టెప్ బ్రదర్ తో కలిసి జాన్వీ చాలాసార్లు ఫోటో సెషన్లలో పాల్గొంది. తరుచూ ఇద్దరు అభిమానుల్ని ఇలా ఆటపట్టిస్తుంటారు. అలాగే జాన్వీ గురించి కూడా అర్జున్ కపూర్ అంతే ఫన్నీగా కామెంట్లు పెడుతుంటాడు.

ఇటీవలే జాన్వీ లగేజీ గురించి ఓ నిగూఢ రహస్యాన్ని బట్ట బయలు చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు సవతి సోదరులు అయినా సొంత అన్నా చెల్లెళ్లు లానే కలిసి ఉంటారు. ఒకరి విషయాలు మరొకరు అభిమానులకు షేర్ చేస్తుంటారు. ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుత దోస్తానా-2 షూటింగ్ లో బిజీగా ఉంది. ఇంకా మరికొన్ని ప్రాజెక్ట్ లు సెట్స్ పై ఉన్నాయి.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 6th July 2024

Posted : July 6, 2024 at 10:17 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 6th July 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement