మంచు విష్ణు తాజాగా అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో పలు విషయాల గురించి అలీ తో మాట్లాడుతూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. వారం రోజులుగా ఈ షో గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రోమోలో మంచు మనోజ్ తో నీకు ఉన్న గొడవ ఏంటీ అంటూ అలీ ప్రశ్నించిన సమయంలో చాలా కోపంతో మంచు విష్ణు లేచి తన బ్లేజర్ ను విప్పుతూ అసహనం వ్యక్తం చేయడం వంటివి చేశాడు. దాంతో ఏం జరిగిందా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూశారు.
తాజాగా ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. షో లో అలీ ద్వారా మంచు విష్ణు అసలు విషయాలను క్లారిటీ ఇచ్చేశాడు. తనకు తమ్ముడికి మద్య ఆస్తి తగాదాలు అంటూ వస్తున్న వార్తలు ఏమాత్రం నిజం కాదని తేల్చి చెప్పాడు. అక్క లక్ష్మి వేరుగా ఉంటుంది. అలాగే తమ్ముడు మనోజ్ కూడా వేరుగా ఉంటున్నాడు. నేను మాత్రం అమ్మా నాన్నలతో కలిసి ఉన్నాను. ఎవరు ఏది పడితే అది అనుకుంటే వారికి నేను సమాధానం చెప్పను. తమ మద్య గొడవలు ఉన్నాయని అనుకునే వారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ విష్ణు క్లారిటీ ఇచ్చేశాడు.