Advertisement

అతడిని గుడ్డిగా నమ్మి ఆరోగ్యం కోల్పోయిందట

Posted : September 21, 2021 at 6:09 pm IST by ManaTeluguMovies

ఇప్పుడు ప్రతిదీ బహిరంగమే. ఎంత ఓపెన్ గా ఉంటే అంత మంచిది. అలా ఓపెన్ అవ్వడం కూడా క్రేజీగా మారింది. అదో రకమైన పబ్లిసిటీగాను సమాజం పరిగణిస్తోంది. అవును నేటి సోషల్ యుగంలో దాచుకోవడం తప్పు.. దాచుకుంటే నీలో నువ్వే కుమిలిపోతావ్… అదే బాధను మరికొంత మందికి చెప్పుకుండే గుండె బరువు తగ్గుతుంది. అవును .. ఇప్పుడు కొంత మంది హీరోయిన్లు ఇదే చేస్తున్నారు. తమ అనారోగ్యాల గురించి.. చెడు అలవాట్ల గురించి ప్రతిదీ బహిరంగ వేదికలపై ఓపెనవుతున్నారు. ఇది ఒక రకమైన ట్రెండ్ గా మారింది.

అందుకు స్టార్ హీరోయిన్లు అతీతం కాదు. రకుల్ ప్రీత్ సింగ్..శ్రుతి హాసన్.. దీపిక పదుకొణే లాంటి వాళ్లు మీడియా ముందే ఇలాంటివి ఎంత ఓపెన్ గా చెప్పారో తెలిసిందే. ఇటీవలే శ్రుతి తాను ఆల్కాహాలిక్ నని.. ఆ సమస్య నుంచి థెరపీ ద్వారా బయటపడినట్లు తెలిపింది. అలాగే రకుల్ కూడా దీర్ఘ కాలికి అనారోగ్యాల నుంచి.. ఒత్తిడి నుంచి యోగా ద్వారా బయటపడినట్లు తెలిపింది.

ఆ రకంగా బయటపడం వల్ల సోసైటీలో అవేర్ నెస్ కూడా తీసుకొచ్చినట్లు అవుతుంది. తాజాగా తమన్నా కూడా తనకున్న అనారోగ్య సమస్యల గురించి తాజాగా వెల్లడించింది. తన ఆహారపు అలవాట్లు..అతిగా వ్యాయామం చేయడం.. ఆకారణంగా ఎక్కువగా ఒత్తిడి కి గురైందిట. ఈ సమస్య ఎప్పడి నుంచో ఉంది. కానీ ఎప్పుడూ బయట పెట్టలేదు. ఇప్పుడు చెప్పాలనిపించి చెప్పానని తెలిపింది. మరి ఇలా ఎందుకు జరిగిందంటే తన డైటీషన్ కారణంగానే ఇబ్బంది పడాల్సి వచ్చిందని తెలిపింది. కెరీర్ ఆరంభంలో సరైన డైటీషన్ ని ఎంపిక చేసుకోలేదని వెల్లడించింది.

అతని చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మి అనారోగ్యానికి గురయ్యాను. ఇప్పుడు అంతా సెట్ అయింది. ప్రస్తుతం ఆహారం తీసుకోవాడంలో చాలా మార్పులు చేసాను. ఎక్కువగా లిక్విడ్ తీసుకుంటున్నాను. పళ్లు తింటున్నాను. సేంద్రీయ ఆహారం తీసుకుంటున్నాను. వేపుళ్లకు దూరంగా ఉంటున్నాను. అలాగే అవసరం మేర వ్యాయామాలు చేస్తున్నానని తమన్నా తెలిపారు. ఇటీవలే తమన్నా నటించిన `సీటిమార్`..`మాస్ట్రో` చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం `ఎఫ్ -3`..`గుర్తుందా శీతాకాలం` చిత్రాల్లో నటిస్తోంది.


Advertisement

Recent Random Post:

బీసీవై పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ పై దాడి | AP Eelection 2024

Posted : April 29, 2024 at 9:49 pm IST by ManaTeluguMovies

బీసీవై పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ పై దాడి | AP Eelection 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement