Advertisement

వంశీ స్క్రిప్ట్ విజయ్ కు నచ్చలేదా?

Posted : September 22, 2021 at 9:51 pm IST by ManaTeluguMovies

మహర్షితో సూపర్ డూపర్ హిట్ కొట్టిన వంశీ పైడిపల్లి కొంత బ్రేక్ తర్వాత మహేష్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేయగా అది తనకు నచ్చలేదు. ఈ స్క్రిప్ట్ కు మార్పులు చేసే క్రమంలో మహేష్ తన కమిట్మెంట్స్ తో బిజీ అయ్యాడు. దీంతో వంశి పైడిపల్లి తమిళ సూపర్ స్టార్ ను కన్విన్స్ చేసాడు. లైన్ గా చెప్పిన దానికి విజయ్ ఇంప్రెస్ అవ్వడంతో ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేసారు.

అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన పైడిపల్లి దాంతో మాత్రం విజయ్ ను మెప్పించలేకపోయాడు. ఈ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేర్పులు సూచించినట్లు తెలుస్తోంది.

దీంతో వంశీ మరోసారి తన టీమ్ తో స్క్రిప్ట్ చేంజస్ పై వర్క్ చేస్తున్నాడు. కథా చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వస్తుంది.


Advertisement

Recent Random Post:

Dialogue War : CM Revanth Reddy Vs Etela Rajender

Posted : April 28, 2024 at 7:34 pm IST by ManaTeluguMovies

Dialogue War : CM Revanth Reddy Vs Etela Rajender

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement