Advertisement

బిగ్ బాస్ 5: నామినేషన్స్ ఫైర్ గట్టిగా అంటుకుంది- ఎపిసోడ్ 37

Posted : October 12, 2021 at 11:37 am IST by ManaTeluguMovies

బిగ్ బాస్ లో అత్యంత ఆసక్తికరంగా, వాడి వేడిగా జరిగే ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా నామినేషన్స్. వివిధ రకాలుగా ప్రతీ సోమవారం కంటెస్టెంట్స్ ఇద్దర్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఈసారి ఫైర్ థీమ్ ను ఎంచుకున్నాడు. ప్రతీ కంటెస్టెంట్ ఇద్దర్ని నామినేట్ చేసి వారి ఫొటోల్ని ఫైర్ లో వేయాల్సి ఉంటుంది.

ముందుగా సన్నీ ఈ ప్రాసెస్ ను మొదలుపెట్టాడు. తను రవి ఇంకా జెస్సీని నామినేట్ చేసాడు. జెస్సీ విషయంలో ఒకడే రాజు టాస్క్ ను రవి చాలా తెలివిగా ఆడాడు అని అన్నావు నేను ఆడింది కూడా తెలివిగానే అని చెప్పి నామినేట్ చేసాడు.

విశ్వ – అన్నీ, ప్రియాంకలను నామినేట్ చేసాడు. ఈ సమయంలో విశ్వ, అన్నీ మాస్టర్ లకు మధ్య చాలా వాగ్వాదం చోటు చేసుకుంది. తనను నామినేట్ చేసారని తీసుకోలేక అన్నీ మాస్టర్ విశ్వపై ఫైర్ అయింది. శ్వేత కూడా టాస్క్ కు సంబంధించిన కారణాలతో సిరి, కాజల్ లను నామినేట్ చేసింది. లోబో అందరికంటే సిల్లీ కారణాలు చెప్పి ప్రియాంక, జెస్సీలను నామినేట్ చేసాడు. సిరి ఇంకా ఆ ఫుడ్ విషయంలో జరిగిన గొడవనే తీసుకుని శ్రీరామ్ ను నామినేట్ చేయగా శ్వేతాపై రివర్స్ నామినేషన్ వేసింది. రవి – మానస్ ఇంకా సిరి లను నామినేట్ చేసాడు. జెస్సీ చేసిన నామినేషన్స్ శ్రీరామ్ ఇంకా సన్నీవి.

ప్రియాంక వచ్చి సూటిగా సుత్తి లేకుండా సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేయకండి అంటూ లోబో, విశ్వలను కడిగిపారేసింది. అదే సమయంలో అసహనంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. మానస్ వచ్చి చాలా కూల్ గా రవి, లోబోలను నామినేట్ చేసాడు. అన్నీ మాస్టర్ మరోసారి ఫైర్ అయ్యారు. షణ్ముఖ్ ను నామినేట్ చేసిన తర్వాత విశ్వను నామినేట్ చేస్తూ కొంచెం గట్టిగానే అరిచారు. తనను అక్క అని పిలవద్దు అంటూ తేల్చి చెప్పేసింది ఆమె. శ్రీరామ్ అందరూ ఊహించినట్లుగానే సిరి, షణ్ముఖ్ లను నామినేట్ చేసాడు. కాజల్ ఎప్పుడూ ఆడే స్ట్రాటజీతో శ్రీరామ్, శ్వేతాలను నామినేట్ చేసింది. షణ్ముఖ్ వచ్చి శ్రీరామ్, లోబోలను నామినేట్ చేయగా ప్రియా విశ్వ, సన్నీలను నామినేట్ చేసింది. మరోసారి విశ్వ, ప్రియా మధ్య వాదులాట జరిగింది.

ఫైనల్ గా నామినేషన్స్ లో పది మంది ఉన్నారు. షణ్ముఖ్, ప్రియాంక, లోబో, శ్రీరామ్, రవి, సిరి, విశ్వ, శ్వేతా, సన్నీ, జెస్సీలు నామినేషన్స్ లో నిలిచారు. కెప్టెన్ ప్రియా కాకుండా ఏన్నీ, మానస్, కాజల్ లు నామినేషన్స్ లో లేరు. తొలిసారి శ్వేతా నామినేషన్స్ లో నిలిచింది.


Advertisement

Recent Random Post:

AP Election 2024 | పగిలేకొద్దీ పదునెక్కే గ్లాస్ | EC Allots Glass Symbol to Rebels & Independent

Posted : April 30, 2024 at 1:26 pm IST by ManaTeluguMovies

AP Election 2024 | పగిలేకొద్దీ పదునెక్కే గ్లాస్ | EC Allots Glass Symbol to Rebels & Independent

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement