తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తాను ఒక క్రియాశీలక మార్పును తీసుకు వస్తానంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు.. వైఎస్ జగన్ సోదరి అయిన వైఎస్ షర్మిల రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె రాజకీయ అరంగేట్రం అంతా కూడా అందరిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. రాజకీయాల్లోకి వస్తుందని ప్రకటించిన తర్వాత జనాలు ఆమె గురించి ఎంత వరకు పట్టించుకుంటారు అనుకుంటూ ఉండగా అనూహ్యంగా ఆమె పాదయాత్ర మొదలు పెట్టింది. ఆమె పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్నారు.
షర్మిల పాదయాత్రలో ఏపీ వైకాపా నాయకులు కనిపిస్తున్నారు. ఇటీవల వైకాపా కీలక నేత మరియు టీటీడీ చైర్మన్ అయిన వైవీ సుబ్బారెడ్డి షర్మిలతో భేటీ అయ్యాడు. ఆ తర్వాత ఆమె ను మంగళగిరి ఎమ్మెల్యే అయిన ఆళ్ల రామకృష్ణ కూడా షర్మిలను కలిశాడు. షర్మిలతో కొంత దూరం పాదయాత్ర చేసి ఆ తర్వాత ఆమెతో గంట పాటు చర్చలు జరిపారు. ఇప్పటికే ఆమెను ఏపీ నాయకులు అంటున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ నాయకులు ఆమెను కలవడం ఆమెకు డ్యామేజీ కలిగిస్తుందని అంటున్నారు.