Advertisement

ఉన్నట్టుండి సారీ! తనలో పశ్చాత్తాపం దేనికి?

Posted : November 8, 2021 at 3:47 pm IST by ManaTeluguMovies

ఆమె ఉన్నట్టుండి సారీ చెప్పింది. ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ ఆమె సారీ ఎవరికి? అంత సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏం వచ్చింది? అంటూ ఇప్పుడు సోషల్ మీడియాల్లో పెద్ద డిబేట్ రన్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరు? అంటే యూత్ హార్ట్ బీట్ రాశీ ఖన్నా.

రాశి ఖన్నా తన బంధువుకు క్షమాపణలు చెబుతూ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం డిబేటబుల్ గా మారింది. అక్కినేని నాగ చైతన్య సరసన థాంక్యూలో నటిస్తున్న రాశీ తాజా `సారీ` కామెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉన్నట్టుండి తనలో పశ్చాత్తాపం దేనికి? అంటూ ఆరాలు మొదలయ్యాయి. సోషల్ మీడియా పేజీలలో తన అభిమానులను అనుచరులను ఆశ్చర్యంతో ఇదే విషయంపై ప్రశ్నిస్తున్నారు. శనివారం భాయ్ దూజ్ సందర్భంగా.. రాశి తన చిన్ననాటి అరుదైన ఫోటోలను షేర్ చేసి..ఆ చిత్రాలకు సంబంధించిన జ్ఞాపకాలను పంచుకుంది. ఒక ఫోటోలో రాశి తన కజిన్ కృతి జుట్టును లాగుతోంది. ఆ ఫోటోతో పాటు ప్రజల దృష్టిని ఆకర్షించేలా వారిని నవ్వించే క్యాప్షన్ వచ్చింది. మీ జుట్టు లాగినందుకు క్షమించండి కృతి! క్షమాపణ చాలా కాలంగా పెండింగ్ లో ఉందని అనుకోండి! అంటూ ఫన్నీగా క్యాప్షన్ ని ఇచ్చింది.

రాశి తన సోదరుడు రౌనక్ కోసం ఒక సాధారణ సూచనను చేసింది. ఎప్పుడూ సంక్షోభంలో నీ వైపు చూస్తాను రౌనక్. హ్యాపీ భాయ్ దూజ్.. నా ప్రియమైన రౌనక్. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను!.. అంటూ వ్యాఖ్యను జోడించింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే థాంక్యూ చిత్రీకరణ దాదాపు ముగింపులో ఉంది. మనం ఫేం విక్రమ్.కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రాశీ కెరీర్ కి ప్లస్ కానుందని భావిస్తున్నారు. మరోవైపు తమిళంలో రాశీ ఖన్నా బిజీ నాయికగా వెలిగిపోతున్న సంగతి తెలిసినదే.


Advertisement

Recent Random Post:

జార్ఖండ్ లో నెక్ టు నెక్ ఫైట్ | Jharkhand Election Result 2024

Posted : November 23, 2024 at 11:45 am IST by ManaTeluguMovies

జార్ఖండ్ లో నెక్ టు నెక్ ఫైట్ | Jharkhand Election Result 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad