Advertisement

మొన్నటి వరకు రూ.10 కోట్లు… ఇప్పుడు 35 కోట్లు!!

Posted : November 17, 2021 at 6:53 pm IST by ManaTeluguMovies

సినిమా ఇండస్ట్రీలో బండ్లు ఓడలు అవ్వడం.. ఓడలు బండ్లు అవ్వడం చూస్తూనే ఉంటాం. ఒక్కసారిగా స్టార్ డం దక్కించుకున్న హీరోలను హీరోయిన్స్ ను మరియు దర్శకులను ఎంతో మందిని చూస్తూ ఉంటాం. వారిలో ఒకరు శివ కార్తికేయన్ అనడంలో సందేహం లేదు. ఒక సాదారణ స్థాయి నుండి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శివ కార్తికేయన్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. బుల్లి తెరపై కనిపించిన ఇతడు వెండి తెరపై ఏం అలరిస్తాడు అనే విమర్శలు చేసిన వారితోనే జేజేలు పలికించుకున్నాడు. వీజే నుండి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. ఈవెంట్స్ లో మిమిక్రీ చేసే ఇతడు ఇప్పుడు ఇండియన్ బిగ్గెస్ట్స్ స్టార్స్ జాబితాలో చేరిపోయాడు. మొన్నటి వరకు ఈయన పారితోషికం 5 నుండి 10 కోట్ల రూపాయలు ఉండేది. కాని ఇప్పుడు ఆయన పారితోషికం అందరికి ఆశ్చర్యంగా ఉంది.

వరుసగా సినిమాలు సక్సెస్ లు దక్కించుకుంటే ఏ హీరో అయినా పారితోషికం పెంచడం కామన్. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు మరియు డాక్టర్ సినిమాతో వంద కోట్ల వసూళ్లు దక్కడంతో పాటు ఇతర భాషల్లో కూడా గుర్తింపు రావడం వల్ల పాన్ ఇండియా హీరో అనే ముద్ర దక్కింది. అందుకే శివ కార్తికేయన్ ఇప్పుడు ఏకంగా 30 నుండి 35 కోట్ల రూపాయల పారితోషికంను డిమాండ్ చేస్తున్నట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల ఈయన తెలుగు మరియు తమిళంలో చేసేందుకు గాను ఒక సినిమాను కమిట్ అయ్యాడు. అది డాక్టర్ విడుదలకు ముందు కనుక 20 నుండి 25 కోట్ల వరకు ఆ సినిమాకు గాను ఈ హీరో తీసుకోబోతున్నాడు. ఇప్పుడు ఆయన రేంజ్ మరింత పెరగడం వల్ల 35 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది.

తమిళంలో ఈ రేంజ్ లో పారితోషికంను అతి కొద్ది మంది మాత్రమే దక్కించుకుంటున్నారు. విజయ్ ఒక్కో సినిమాకు దాదాపుగా వంద కోట్ల వరకు వసూళ్లు చేస్తుండగా అజిత్.. రజినీకాంత్.. కమల్ వంటి స్టార్స్ 50 కోట్లకు లోపు పారితోషికంను అందుకుంటున్నారు. శివ కార్తికేయన్ ఇప్పుడు దాదాపుగా సీనియర్ స్టార్ అయిన సూర్యతో సమానమైన పారితోషికంను అందుకుంటున్నాడు అనే టాక్ తమిళ మీడియా వర్గాల్లో వినిపిస్తుంది. మరో రెండు మూడు హిట్స్ భారీగా పడటంతో పాటు తెలుగు లో ఈయన చేయబోతున్న సినిమా కనుక సక్సెస్ అయితే 50 కోట్లకు ఈయన పారితోషికం చేరినా ఆశ్చర్యం లేదు. పాన్ ఇండియా స్టార్స్ కు.. ద్విభాష సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న ఈ సమయంలో కార్తికేయ కనుక మల్టీ లాంగ్వేజ్ సినిమాల్లో నటిస్తే ఖచ్చితంగా ఆయన పారితోషికం అంతకంతకు పెరిగి పోవడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Guntur : ఎమ్మెల్యే జూలకంటి బావమరిదిపై దాడి

Posted : November 3, 2024 at 6:15 pm IST by ManaTeluguMovies

Guntur : ఎమ్మెల్యే జూలకంటి బావమరిదిపై దాడి

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad