Advertisement

నయన్ ప్రియుడి చేతికి సూపర్ స్టార్ వారసుడు

Posted : December 2, 2021 at 9:26 pm IST by ManaTeluguMovies

కోలీవుడ్ సూపర్ స్టార్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ఇప్పటికే పరిచయం అయ్యాడు. అర్జున్ రెడ్డి తమిళ వర్షన్ లో ధృవ్ నటించి హీరోగా మెప్పించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం తండ్రితో కలిసి ఒక సినిమాను చేస్తున్నాడు. భారీ అంచనాలున్న ఆ సినిమా తర్వాత ధృవ్ వరుసగా సినిమాలను చేసేందుకు సిద్దం అయ్యాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ధృవ్ రెండవ సినిమా విడుదలకు ముందే మరో సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ధృవ్ మూడవ సినిమా కు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించబోతున్నాడట. వీరిద్దకి కాంబో మూవీ అతి త్వరలోనే పట్టాలెక్కబోతున్నట్లుగా కూడా తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.

నయనతార ప్రియుడు అయిన విఘ్నేష్ శివన్ ఈమద్య కాలంలో వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నయనతార.. సమంత మరియు విజయ్ సేతుపతి లు కీలక పాత్రల్లో నటించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. అన్ని కుదిరితే ఈ నెలలోనే ఆ సినిమాను విడుదల చేయాలని విఘ్నేష్ శివన్ భావిస్తున్నాడు. డిసెంబర్ లో విడుదల చేయబోతున్న ఆ సినిమా తర్వాత ధృవ్ సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ధృవ్ సినిమా అనగానే అంచనాలు ఉంటున్నాయి. కనుక విఘ్నేష్ శివన్ పై కాస్త ఒత్తిడి ఉండటం ఖాయం. మరి ఆ ఒత్తిడిని ఎలా జయించి సినిమాను సక్సెస్ చేస్తాడు అనేది చూడాలి. ఇప్పటికే కథ ఓకే అయ్యిందని తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు కమర్షియల్ గా బిగ్గెస్ట్ సక్సెస్ లు అందుకోలేక పోయాయి. నయనతార తో కలిసి నిర్మాణం కూడా మొదలు పెట్టిన విఘ్నేష్ శివన్ పెద్ద హీరోలతో సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎట్టకేలకు ఈ క్రేజీ యంగ్ హీరో ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ధృవ్ కు కనుక ఒక వేళ సూపర్ హిట్ ను విఘ్నేష్ శివన్ ఇస్తే ఖచ్చితంగా ముందు ముందు మరిన్ని సినిమాలు అవి కూడా పెద్ద హీరోల సినిమాలు పడటం ఖాయం అంటున్నారు. విఘ్నేష్ శివన్ మరియు నయనతారలు సుదీర్ఘ కాలంగా రిలేషన్ లో ఉన్నారు. వచ్చే ఏడాది లో వీరి పెళ్లి ఉంటుందని అంటున్నారు. గత ఏడాది కూడా వీరి పెళ్లి గురించిన వార్తలు వచ్చాయి. కనుక ఈసారి కూడా వారి పెళ్లి విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Advertisement

Recent Random Post:

Kolkata Doctor Case : మరో టర్న్ తీసుకున్న డాక్టర్ హత్యాచారం కేసు

Posted : September 13, 2024 at 10:28 pm IST by ManaTeluguMovies

Kolkata Doctor Case : మరో టర్న్ తీసుకున్న డాక్టర్ హత్యాచారం కేసు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad