Advertisement

బిగ్ బాస్ 5: ఆడియన్స్ ప్రశ్నలకు ఎవరు జెన్యూన్ గా సమాధానం ఇచ్చారు?

Posted : December 11, 2021 at 11:34 am IST by ManaTeluguMovies

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంటుంది. ఈ వారం చివరికి ఫైనల్స్ కు వెళ్లే మిగతా నలుగురు ఎవరో తెలిసిపోతుంది. ఇప్పటికే టికెట్ టు ఫినాలే గెలిచి శ్రీరామ్ చంద్ర మొదటి ఫైనలిస్ట్ గా నిలిచిన విషయం తెల్సిందే. అలాగే ఈ వారమంతా బిగ్ బాస్ ఓట్ అప్పీల్ టాస్క్ ను కంటెస్టెంట్స్ కు ఇచ్చాడు. డిఫరెంట్ లెవెల్స్ లో టాస్క్ పెట్టగా ఇప్పటికే షణ్ముఖ్ జస్వంత్, మానస్ లు ఆడియన్స్ కు ఓట్ అప్పీల్ చేసుకున్నారు.

నిన్నటి ఎపిసోడ్ లో సూపర్ స్టార్స్ టాస్క్ కొనసాగింది. షణ్ముఖ్ సూర్యగా, శ్రీరామ్ చంద్ర చిరంజీవిగా, మానస్ పవన్ కళ్యాణ్ గా, సన్నీ బాలకృష్ణగా, కాజల్ శ్రీదేవిగా, సిరి జెనీలియాగా నటించిన విషయం తెల్సిందే. మొన్నటి ఎపిసోడ్ లో అందరూ ఆయా సూపర్ స్టార్ పాటలకు డ్యాన్స్ లు వేయగా నిన్నటి ఎపిసోడ్ లో ఒక చిన్న స్కిట్ చేసారు. ఆ స్కిట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ టాస్క్ లో అందరూ కాజల్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినట్లుగా ఓట్ చేసారు. దీంతో కాజల్ కు ఆడియన్స్ కు అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది.

ఆ తర్వాత ఓట్ అప్పీల్ టాస్క్ లో భాగంగా ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు కంటెస్టెంట్స్ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఎవరైతే నిజాయితీ సమాధానాలు చెబుతారో వారిని ఏకాభిప్రాయంతో బిగ్ బాస్ కు పేరు చెప్పాల్సి ఉంటుంది. వారికి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

ఈ రౌండ్ లో ఆడియన్స్ కొన్ని ఆసక్తికర టాపిక్స్ నే తీసుకున్నారు. ఉదాహరణకు షణ్ముఖ్ కు అడిగిన ప్రశ్న, మీరు ఎందుకు సిరిని కంట్రోల్ చేస్తున్నారు? ఎందుకని ఆమెను ఆమెలా ఉంచే అవకాశం ఇవ్వట్లేదు? అలాగే సిరికి మీరు షణ్ముఖ్ కన్నా స్ట్రాంగ్ ప్లేయర్ అయినా కూడా తనకు ఎందుకు నెం 1 ర్యాంకింగ్ ఇచ్చారు? ఇక మానస్ కు వచ్చిన ప్రశ్న, సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్ గా ఉపయోగించుకుంటున్నాడు అనుకుంటున్నారా? అలాగే శ్రీరామ్ కు, కాజల్ ఇద్దరి ఫోటోలు కాల్చేయాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు అదే స్ట్రాటజీ వేసిన మీరే దాన్ని ఎందుకు వ్యతిరేకించారు? సన్నీకి గిల్టీ బోర్డ్ తర్వాత మీ కాన్ఫిడెన్స్ ను ఎలా బిల్డ్ చేసుకున్నారు? కాజల్ కు వచ్చిన ప్రశ్న, మొదట షణ్ముఖ్ తో, తర్వాత రవితో, ఇప్పుడు మానస్, సన్నీతో ఫ్రెండ్ షిప్ కేవలం బిగ్ బాస్ లో ముందుకు వెళ్లడానికేనా? వంటివి ఆసక్తికరంగా అనిపించాయి.

వీటికి కంటెస్టెంట్స్ కూడా బాగానే సమాధానాలు చెప్పారు. ఈ రౌండ్ లో సన్నీకి మెజారిటీ ఓటింగ్ వచ్చి తనకు ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం లభించింది.


Advertisement

Recent Random Post:

Kolkata Doctor Case : మరో టర్న్ తీసుకున్న డాక్టర్ హత్యాచారం కేసు

Posted : September 13, 2024 at 10:28 pm IST by ManaTeluguMovies

Kolkata Doctor Case : మరో టర్న్ తీసుకున్న డాక్టర్ హత్యాచారం కేసు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad