Advertisement

పుష్ప కథ ఏంటో తెలియకుండానే నటించేసిందట

Posted : December 14, 2021 at 11:10 pm IST by ManaTeluguMovies

మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అల్లు అర్జున్.. సుకుమార్ కాంబోలో గతంలో వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఈ సినిమాలో బన్నీ చాలా స్పెషల్ గా కనిపిస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా కనిపించబోతున్నట్లుగా మొదటి నుండే వార్తలు వచ్చాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ కనిపిస్తాడు. స్టోరీ అంతకు మించి ఏమీ తెలియదు. సినిమా కథ గురించి ఇతరులు ఎవరు కూడా క్లారిటీగా చెప్పడం లేదు. ఇతర సినిమాల ప్రమోషన్ సమయంలో స్టోరీ లైన్ రివీల్ అవుతూ ఉంటుంది. ఎవరో ఒకరు లీక్ చేయడం లేదా నోరు జారడం చేస్తూ ఉంటారు. కాని పుష్ప కథ విషయంలో అలా జరగడం లేదు.

తాజాగా పుష్ప సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ రష్మిక మందన్నా మాట్లాడుతూ కథ ఏంటో తనకు తెలియదు అనేసింది. స్టోరీ లైన్ గురించి చెప్పమంటూ మీడియా వారు అడిగిన సమయంలో ఆమె నుండి ఈ సమాధానం వచ్చింది. కొందరు తెలిసినా తెలియదు అని చెప్తారు.. కాని రష్మిక కు పుష్ప సినిమా కథ తెలిసి ఉండదు. ఎందుకంటే సుకుమార్ యూనిట్ లో ఒక్కరు ఇద్దరికి మాత్రమే కథ చెబుతూ ఉంటాడు. పూర్తి కథ తాను కూడా షూటింగ్ పూర్తి అయ్యే వరకు క్లారిటీగా ఉండదు. షూటింగ్ సమయంలో కూడా సీన్స్.. సన్నివేశాలు.. కొన్ని సార్లు కథను కూడా మారుస్తూ ఉంటాడు అనేది టాక్. అందుకే రష్మికకు కథ చెప్పి ఉండదు అనడంలో సందేహం లేదు.

రష్మిక మాట్లాడుతూ ఎప్పుడు కూడా నాకు సుకుమార్ సర్ కథ చెప్పలేదు. కేవలం ఆయనపై నమ్మకంతో సినిమా చేసుకుంటూ వెళ్తాను. డబ్బింగ్ చెబుతున్న సమయంలో సినిమా కాస్త అవగాహన కు వచ్చింది. సినిమాలోని సన్నివేశాలు కొన్ని చూసిన తర్వాత ఈ సినిమాలో నటించడం నా అదృష్టం ఉన్నట్టు అనిపించిందని రష్మిక పేర్కొంది. పుష్ప కథ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి లీక్ లేదు. సినిమా ఈనెల 17వ తారీకున విడుదల అయితే కానీ పుష్ప కథ ఏంటీ అనే విషయంలో క్లారిటీ రాదు. పుష్ప సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో అయిదు భాషల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. అన్ని భాషల్లో కూడా ఈ సినిమా కు లైన్ క్లీయర్ గా ఉంది. పెద్ద సినిమాల పోటీలు ఎక్కడ లేవు. కనుక అన్ని భాషల్లో కూడా భారీగా వసూళ్లు రాబట్టడం ఖాయం అనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. 250 కోట్ల రూపాయల టార్గెట్ తో పుష్ప సినిమా రిలీజ్ అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. బాలయ్య అఖండ విజయం తో పుష్ప మేకర్స్ నమ్మకం పెంచుకున్నారు. మరి వారి నమ్మకం ఎంత వరకు నిజం అవుతుంది అనేది చూడాలి.


Advertisement

Recent Random Post:

ఇజ్రాయెల్ పోరు | Middle East Crisis | 8 Israel Soldiers Dead As Hezbollah Claims To Repel incursion

Posted : October 3, 2024 at 1:57 pm IST by ManaTeluguMovies

ఇజ్రాయెల్ పోరు | Middle East Crisis | 8 Israel Soldiers Dead As Hezbollah Claims To Repel incursion

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad