Advertisement

వర్మ జిమ్మిక్కులు అస్సలు పనిచేయడం లేదుగా!

Posted : January 27, 2022 at 12:04 pm IST by ManaTeluguMovies

రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి రావడమే ఒక సంచలనం. శివ తర్వాత వర్మ దగ్గర పనిచేయాలన్న కలలు కన్నవారు ఎంత మందో. ఆ తర్వాత వర్మ తన మీద నమ్మకాన్ని నిలబెడుతూ కొన్ని సెన్సేషన్స్ ను అందించాడు. రామ్ గోపాల్ వర్మ అనే బ్రాండ్ ను క్రియేట్ చేయగలిగాడు.

అయితే వర్మలోని క్రియేటివ్ జ్యూస్ మొత్తం అయిపోయిందో మరొకటో కానీ తనలో క్రియేటివిటీ తగ్గి కాంట్రవర్సీ పెరిగింది. పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరింది. వర్మ ఏం చేస్తే అదే పబ్లిసిటీ అనే స్థాయి నుండి, పబ్లిసిటీ కోసం వర్మ ఏదైనా చేస్తాడు అనే దాకా వచ్చింది పరిస్థితి.

మొదట్లో వర్మ పాచికలు పారేవి. పబ్లిసిటీ జిమ్మిక్ కు పడిపోయేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వర్మ ఏం చేసినా లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. దానికి నిదర్శనం కొండా చిత్రం. ఈ సినిమా కోసం వర్మ చేయని కాంట్రవర్సీ అంటూ లేదు కానీ ఆడియన్స్ పట్టించుకుంటున్న పాపాన పొవట్లేదు.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 6th May 2024

Posted : May 6, 2024 at 10:27 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 6th May 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement