Advertisement

సలార్ బ్యూటీ బర్త్డే ట్రీట్ వచ్చేసింది

Posted : January 28, 2022 at 12:19 pm IST by ManaTeluguMovies

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `కాటమ రాయుడు` చిత్రంతో టాలీవుడ్ కు బ్రేకిచ్చింది శృతిహాసన్ కొంత విరామం తరువాత మాస్ మహారాజా రవితేజ నటించిన `క్రాక్` మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తరువాత శృతి చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి శృతిహాసన్ కు మళ్లీ గ్రాండ్ వెల్కమ్ పలికింది. ఈ మూవీ సక్సెస్ తో రెట్టించిన ఉత్సాహంతో వున్న శృతిహాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి నటిస్తోంది.

ప్రభాస్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `సలార్`. కన్నడ స్టార్ యష్ తో `కేజీఎఫ్` వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించి దేశ వ్యాప్తంగా హాట్ ఫేవరేట్ గా నిలిచారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన ప్రస్తుతం `సలార్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కోల్ మైన్స్ నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది.

శుక్రవారం జనవరి 28న శృతిహాసన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ మూవీ మేకర్స్ శృతిహాసన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ రోజుని స్పెషల్ గా జరుపుకోవాలని ఎదురుచూస్తున్న అభిమానులకు మరింత స్పెషల్ న్యూస్ ని అందించిన వారి ఆనందాన్ని రెట్టింపు చేశారు. అంతే కాకుండా ఇందులోశృతిహాసన్ క్యారెక్టర్ పేరుని కూడా మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో శృతి పాత్ర పేరు ఆధ్యా. ఫష్ట్ లుక్ పోస్టర్ లో శృతి సీరియస్గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.

లైట్ మెరున్ కలర్ చుడిదార్ లో శృతి కనిపిస్తున్న తీరు ఆమె సీరియస్ లుక్ ఆకట్టుకుంటోంది. శృతిహాసన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని షేర్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. అంతే కాకుండా `సలార్` ప్రాజెక్ట్ లో తను ఓ భాగం అయినందుకు అభినందనలు తెలియజేశాడు. ఆమె వల్లే సెట్ కు కలర్ వచ్చిందని చెప్పుకొచ్చాడు.

ఇటీవలే యూరప్ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ప్రభాస్ త్వరలో ఈ మూవీ తాజా షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ చిత్రీకరణ దాదాపు 50 శాతం పూర్తయింది. కోవిడ్ కారణంగా గత కొన్ని రోజులుగా బ్రేక్ ఇచ్చిన ఈ మూవీ తాజా షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.

మిగతా భాగాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేసి చిత్రాన్ని ఇదే ఏడాది స్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో శృతిహాసన్ కూడా పవర్ ప్రాధాన్యత వున్న పాత్రలో కనపించనుందని తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

Gold Price Today : భారీగా తగ్గిన బంగారం ధరలు

Posted : April 24, 2024 at 12:40 pm IST by ManaTeluguMovies

Gold Price Today : భారీగా తగ్గిన బంగారం ధరలు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement