Advertisement

ఎర, వేటగాడు.! ఎవరికో, ఎక్కడో బాగా కాలినట్టుంది.!

Posted : February 15, 2022 at 6:06 pm IST by ManaTeluguMovies

‘ఎర’ను ఆహారం అనుకుని ఆశపడే స్థితిలో వున్న ప్రతి జాతి వేటగాళ్ళకు చిక్కుతూనే వుంటుంది.. అంటూ ‘వాకాడ శ్రీనివాసరావు’ చెప్పిన ఓ కోట్‌ని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తనకు నచ్చినమైన కోట్‌గా పేర్కొన్నారు.. అదీ సోషల్ మీడియాలో.

అంతే, ఇలా పవన్ నుంచి ట్వీట్ రాగానే.. అలా సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ అయ్యింది. గుమ్మడికాయ దొంగ.. అని పవన్ కళ్యాణ్ అనుకుండానే చాలామంది తమ భుజాలు తడిమేసుకున్నారు. కొందరేమో, ‘స్వామి భక్తి’ చాటుకున్నారు.. తమ యజమాని మెప్పు కోసం పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా కథనాల్ని తెరపైకి తెచ్చారు. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్న చందాన తయారైంది వ్యవహారం.

ఎవరో చెప్పిన కోట్ తనకు బాగా ఇష్టమని పవన్ కళ్యాణ్ పేర్కొనగానే, అందులో పవన్ కళ్యాణ్ తిట్టింది తమనేననీ, తమ యజమానిని పవన్ తిట్టారనీ.. ఇలా ఎవరికి వారు తెగ ఇదయిపోయారు. తమ పైత్యానికి పని చెప్పారు.

వాకాడ శ్రీనివాసరావు ఎవరు.? అన్నది వేరే చర్చ. ఆయన చెప్పిన విషయమైతే నిజం. ఎరను ఆహారం అనుకుని ఆశపడే స్థితిలో వున్న ప్రతి జాతి వేటగాళ్ళకు చిక్కుతూనే వుంటుంది. సంక్షేమ పథకాల పేరుతో జనానికి రాజకీయ పార్టీలు ఎర వేస్తుంటాయి. అదే ఆహారం అనుకుని ఆశపడటం ఓటర్లకూ అలవాటైపోయింది.

ఆ సంక్షేమ పథకాల్ని అప్పులు చేసి అధికారంలో వున్నవారు పంచుతున్నారనీ, ఆ అప్పులకి వడ్డీలు సైతం తమ ముక్కు పిండే వసూలు చేస్తున్నారనీ ప్రజలు గుర్తించడంలేదన్నది ఓపెన్ సీక్రెట్. ప్రజలు గనుక అలా గుర్తిస్తే, ‘మీ సంక్షేమ పథకాలకు ఓ దండం..’ అనే అంటారు.

నిజానికి, ఆ సంక్షేమ పథకాల్లో సొంత పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలకే ఎక్కువ వాటాలు దక్కుతుంటాయి.. ఎవరు అధికారంలో వున్నా సరే. ఆ సంగతి పక్కన పెడదాం, పవన్ కళ్యాణ్ చాన్నాళ్ళ తర్వాత ట్వీటేశారు. పవన్ ట్వీటేయగానే.. రెస్పాన్స్ అదిరిపోయింది.

చాలామందికి పవన్ కళ్యాణ్ ట్వీటులోని ‘వాస్తవం’ బోధపడింది. కొంతమందికి కంగారు తెప్పించింది.. ఎక్కడ జనం చైతన్యవంతులైపోతే, తమ జీవితాలు గల్లంతయిపోతాయనన్న భయం కారణంగా. వాళ్ళే ఉలిక్కి పడి పవన్ కళ్యాణ్ మీద బురద చల్లడం షురూ చేశారు.


Advertisement

Recent Random Post:

Special Focus on Operation Boats | ఇప్పటివరకు వేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ |

Posted : September 15, 2024 at 8:01 pm IST by ManaTeluguMovies

Special Focus on Operation Boats | ఇప్పటివరకు వేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad