Advertisement

ఒకే రోజు రెండు క్రేజీ మూవీస్.. ఐనా ఇబ్బందేం లేదట!

Posted : February 23, 2022 at 11:39 am IST by ManaTeluguMovies

ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రెండు మూడు వచ్చినా పెద్దగా సమస్య ఉండేది కాదు. నెలలకు నెలలు సినిమాలు ఆడేవి కనుక హిట్ అయితే రెండు సినిమాలకు సమానమైన వసూళ్లు నమోదు అయ్యేవి. కాని ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎంత పెద్ద హిట్ సినిమా అయినా కూడా మూడు నాలుగు వారాల కంటే ఎక్కువగా థియేటర్లలో ఉండటం లేదు. రెండు వారాలకు మించి ఆడటమే గగనం అయిన ఈ రోజుల్లో ఒకే రోజు రెండు సినిమాలు విడుదల అవ్వడం చాలా నష్టం కలిగించే విషయం.

రెండు సినిమాకు కనీసం వారం గ్యాప్ ను మెయింటెన్ చేయాల్సిందే అంటూ ఈమద్య నిర్మాతల మండలి నిర్ణయానికి వచ్చింది. పెద్ద సినిమాల విషయంలో అదే జరుగుతుంది. కాని మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రం తప్పని పరిస్థితుల్లో క్లాష్ అవ్వాల్సి వస్తుంది. కరోనా వల్ల చాలా కాలం గా వాయిదాలు పడుతూ వస్తున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలో మేజర్ మరియు ఎఫ్ 3 సినిమా లు క్ల్యాష్ అవ్వబోతున్నాయి.

ఇప్పటికే ఎఫ్ 3 సినిమాను మే 27న విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు కలిసి నటించిన ఎఫ్ 3 సినిమాకు అనీల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఎఫ్ 3 పై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. కనుక ఆ సినిమా ఇతర సినిమాలతో పోటీ పడకుండా సోలోగా రావాలనుకుంది.

ఇతర సినిమాలు ఏవీ కూడా ఎఫ్ 3 తో పోటీ పడాలని కోరుకోవడం లేదు. ఈ సమయంలో మేజర్ ను మాత్రం అదే తేదీకి విడుదల చేయాలని భావించడం కాస్త చర్చనీయాంశంగా మారింది. వసూళ్ల పరంగా రెండు సినిమాలకు కూడా తప్పకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి రెండు సినిమాలు పోటీ పడటం వల్ల రెండు సినిమాలకు కూడా నష్టం తప్పదేమో అంటున్నారు.

ఈ సమయంలో మేజర్ సినిమా మేకర్స్ స్పందిస్తూ ఎఫ్ 3 సినిమా మా సినిమా రెండు కూడా పూర్తి విభిన్నమైన కాన్సెప్ట్ లతో తెరకెక్కిన సినిమాలు. ఏ సినిమా ఆడియన్స్ ఆ సినిమాకు ఉన్నారు. కనుక రెండు సినిమాలు ఒకే రోజు వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు అంటున్నారు. ఎఫ్ 3 మరియు మేజర్ సినిమాలు పోటీ కానే కావు అని.. రెండు సినిమాలు కూడా వేటికి అవే సక్సెస్ అయ్యి మంచి వసూళ్లు దక్కించుకుంటాయని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మేజర్ సినిమా తో అడవి శేషు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బయోపిక్ గా రూపొందిన మేజర్ సినిమా దేశ భక్తి ప్రధానంగా సాగుతుంది. ఎఫ్ 3 సినిమా కామెడీ నిండిపోయి ఉంటుంది. కనుక ప్రేక్షకులు ఏ సినిమా చూడాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఎవరి అభిరుచికి తగ్గట్లుగా వారు ఆ సినిమా కు వెళ్తారు. కనుక ఈ రెండు సినిమాల మద్య పోటీ అనేది ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ అయ్యి మంచి వసూళ్లు దక్కించుకున్నా ఆశ్చర్యం లేదు.


Advertisement

Recent Random Post:

Mahrashtra Election Results :ప్రియాంక గాంధీ ఓడిపోతే వార్త.. గెలిస్తే కాదు : BJP Premender Reddy

Posted : November 23, 2024 at 1:01 pm IST by ManaTeluguMovies

Mahrashtra Election Results :ప్రియాంక గాంధీ ఓడిపోతే వార్త.. గెలిస్తే కాదు : BJP Premender Reddy

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad