Advertisement

టైగర్ 3 టీజర్: కత్రిన దెబ్బకు ఫ్యూజ్ లు కాలిపోయాయ్!

Posted : March 5, 2022 at 12:56 pm IST by ManaTeluguMovies

పోటీలో యాక్షన్ క్వీన్స్ ఎందరు ఉన్నా కత్రిన వేరు! ముఖ్యంగా ధూమ్ 3 తో యాక్షన్ క్వీన్ గా మారిపోయిన కత్రిన ఆ తర్వాత `టైగర్ జిందా హై`తో మరో లెవల్ యాక్షన్ ని పరిచయం చేసింది. బాలీవుడ్ కి ఒక లేడీ సూపర్ హీరో దొరికిందన్న భరోసా కనిపించింది. దీనిని నిజం చేస్తూ ఇప్పుడు సూపర్ గాళ్ పాత్రలోనూ నటించనుంది. టైగర్ జిందా హై దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమాని తెరకెక్కిస్తారు.

మరోవైపు టైగర్ 3లో సల్మాన్ కి ధీటైన యాక్షన్ క్వీన్ పాత్రలో కనిపించనుంది కత్రిన. బాలీవుడ్ హిట్ పెయిర్ సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం టైగర్ 3 విడుదల తేదీని ఖరారు చేసారు. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతోంది. ఈరోజు నాయకానాయికలు ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో విడుదల తేదీని 1ఏప్రిల్ 2023గా ప్రకటించే టీజర్ ని ఆవిష్కరించారు. అలాగే అభిమానులు టీజర్ లో కత్రినా కైఫ్ ఎనర్జిటిక్ యాక్షన్ క్వీన్ లుక్ కి ఫిదా అయిపోయారు.

యాక్షన్ సీక్వెన్స్ ల్లో మరో లెవల్ అంటే ఏంటో కత్రిన చూపిస్తోంది. టోన్డ్ బాడీ – పర్ఫెక్ట్ వేవ్ లెంగ్త్ ఎనర్జీతో చెలరేగుతోంది కత్రిన. భారీ బ్లాక్ బస్టర్ ఖాయమన్న భరోసాని ఇది ఇచ్చింది. కత్రినా నిజంగా యాక్షన్ లో పాలుపంచుకున్న విషయం అభిమానుల్ని ఎగ్జయిట్ చేస్తోంది. కొన్ని పంచ్ లు గాయాలు ఉన్నాయి. టీజర్ నుండి ఆమె స్క్రీన్ షాట్ లు ఎక్కువ స్థాయిలో సోషల్ మీడియాలోకి షేర్ అయ్యాయి. కత్రిన దెబ్బకు ఫ్యూజులు ఔట్ అన్న తీరుగా సోషల్ మీడియా ప్రస్తుతం హీటెక్కిస్తోంది. యూత్ కి తన పాత్ర అంతగా కనెక్టయిపోయింది. సల్మాన్ పక్కనే ఉన్నా కత్రిన యూనిక్ నెస్ కొట్టొచ్చినట్టు కనిపించింది.

మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. టీజర్ లో కత్రినా కైఫ్ అద్భుతమైన స్టంట్ సన్నివేశాలు మాత్రమే కాకుండా సల్మాన్ ఖాన్ ఎంట్రీని కూడా చూపించారు. ఎందుకంటే టైగర్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు ఎటాక్ కోసం అనే మీనింగ్ ధ్వనించింది. అదే సమయంలో టైగర్ 3తో పాటు కత్రినాకు సిద్ధాంత్ చతుర్వేది- ఇషాన్ ఖట్టర్ తో ఫోన్ భూత్.. ప్రియాంక చోప్రా అలియా భట్లతో జీ లే జరా చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Advertisement

Recent Random Post:

Salman Khan Residence Firing Accused Lost Life in Jail

Posted : May 1, 2024 at 5:01 pm IST by ManaTeluguMovies

Salman Khan Residence Firing Accused Lost Life in Jail

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement