మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత అగ్ర దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. శ్రీకాంత్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం శ్రీకాంత్ పాత్రకు భిన్నమైన షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడట. తండ్రి రామ్ చరణ్ పాత్రకు శ్రీకాంత్ మంచి స్నేహితుడుగా ఉంటాడని, అయితే పొలిటికల్ గా ఎదుగుతోన్న క్రమంలో చరణ్ కు సమయం చూసి వెన్నుపోటు పొడుస్తాడని తెలుస్తోంది.
ఆలాగే మెయిన్ విలన్ గా చేస్తోన్న ఎస్ జె సూర్య పాత్రకు, శ్రీకాంత్ పాత్రకు మధ్య ఉన్న కనెక్షన్ కూడా షాకింగ్ గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కియారా అద్వానీ కథానాయిక.