Advertisement

ఫోటోటాక్ : అలా ఓరకంట చూస్తే కుర్రకారు ఏమై పోతారమ్మడు?

Posted : March 16, 2022 at 10:06 pm IST by ManaTeluguMovies

నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో వచ్చిన మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అను ఎమాన్యూల్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా అను ఎమాన్యూల్ మాత్రం నిరాశ పర్చలేదు. తన అందంతో మరియు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. అందమైన అను ఎమాన్యూల్ కు అనూహ్యంగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

కిట్టు ఉన్నాడు జాగ్రత్త మరియు ఆక్సీజన్ వంటి చెత్త సెలక్షన్స్ తో అను ఎమాన్యూల్ తన మొదటి సినిమాతో వచ్చిన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంది. ఆ సినిమాలు ప్లాప్ అయినా కూడా అను ఎమాన్యూల్ కు ఎక్కడో లక్ కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ కు జోడీగా అజ్ఞాతవాసి మరియు అల్లు అర్జున్ కు నా పేరు సూర్య సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ రెండు సినిమాలు కూడా అను ఎమాన్యూల్ కు నిరాశనే మిగిలచ్చాయి.

అంత పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసినా ఈ అమ్మడి కెరీర్ టర్న్ కాలేదు. అయినా ఆఫర్లు మాత్రం అడపా దడపా వస్తూనే ఉన్నాయి. తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతూ వస్తుంది. ప్రస్తుతం కూడా తెలుగు లో రావణ సుర అనే సినిమాలో రవితేజ కు జోడీగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హీరోయిన్ గా స్టార్ డమ్ దక్కించుకోలేక పోయినా ఇన్ స్టా గ్రామ్ లో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు మరియు హాట్ వీడియోలతో స్టార్ డమ్ ను ఓ రేంజ్ లో దక్కించుకుంటుంది అనడంలో సందేహం లేదు.

రెగ్యులర్ గా ఈ అమ్మడి అందాల ఆరబోతకు అభిమానులు మరియు ఫాలోవర్స్ ఫిదా అవ్వాల్సిందే. తాజాగా షేర్ చేసిన ఫోటోలో ఎక్స్ ప్రెషన్ తో కిల్ చేసినట్లుగా అను ఎమాన్యూల్ చూస్తోంది.

అను షేర్ చేసిన ఈ ఫోటోకు అభిమానులు మరియు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలా ఓరకంట చూస్తే కుర్రకారు ఏమై పోతారు అంటూ ఆమెను సరదాగా జనాలు ప్రశ్నిస్తున్నారు. అందంతో చంపేస్తున్నారు అంటూ ఈమె పై పోలీసులకు ఫిర్యాదు చేయాలి అంటూ కొందరు సరదా కామెంట్స్ చేస్తూ ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నాం అంటున్నారు.


Advertisement

Recent Random Post:

Baak Movie Team Fun & Spooky Chat | Full Video | Sundar C,Tamannaah, Raashii Khanna

Posted : April 30, 2024 at 7:36 pm IST by ManaTeluguMovies

Baak Movie Team Fun & Spooky Chat | Full Video | Sundar C,Tamannaah, Raashii Khanna

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement