Advertisement

RRR స్టార్స్ పై యూట్యూబర్ షాకింగ్ సెటైర్స్

Posted : March 18, 2022 at 7:56 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళికి తన సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలిసినంతగా మరొకరికి తెలియదంటుంటారు. నిజమే. ఎందుకంటే ఆయన తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్` ని జనవరి 7న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. డేట్ కూడా ఫిక్స్ అయింది. ప్రమోషన్స్ ని జోరుగా ప్రారంభించేశారు. ఏ ప్లాట్ ఫామ్ ని వదలకుండా చివరికి ప్రో కబడ్డీ గేమ్ ప్రసారం అవుతున్న ఛానల్ ని కూడా వదల కుండా ప్రమోట్ చేసి సినిమాని ఇలా కూడా ప్కమోట్ చేయోచ్చని నిరూపించారు.

జక్కన్న ప్రమోషన్స్ చూసిన టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి కూడా. ఇదిలా వుంటే జనవరి 7న సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. ఫైనల్ గా మార్చి 25న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో జక్కన్న మళ్లీ ప్రమోషన్స్ ప్రారంభించేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లు మీడియాతో ప్రత్యేక చిట్ చాట్ లు మొదలుపెట్టారు.

రీసెంట్ గా బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్స్ ని కూడా వదల కుండా ప్రచారానికి వాడేశారు. అయితే ఈ సందర్భంగా ఫేమస్ యూట్యూబర్ భువన్ బాన్ కు రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా భువన్ బాన్ చేసిన చిట్ చాట్ నెట్టింట నవ్వులు పూయించింది. ఇదే సందర్భంగా భువన్ బాన్ నవ్విస్తూనే ఆర్ ఆర్ ఆర్ స్టార్స్ పై సెటైరలు వేయడం ఇప్పడు వైరల్ గా మారింది.

రామ్ చరణ్ కెరీర్ లో అత్యంత డిజాస్టర్ గా నిలిచిన హిందీ చిత్రం `జంజీర్` ఈ సినిమా గురించి ప్రస్తావించిన భువన్ థియేటర్లలో జనం లేకపోవడంతో తాను సినిమా చూడలేక పడుకున్నానని సెటైర్ వేశాడు. అయితే తను వేసిన పంచ్ ని రామ్ చరణ్ చాలా ఫన్నీ వేలో తీసుకుని నవ్వేశాడు. ఆ తరువాత ఎన్టీఆర్ వంతు. ఎన్టీఆర్ కెరీర్ లో `శక్తి` కూడా అలాంటి అనుభవాన్నే మిగిల్చింది. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ తో సూటిగా చెప్పేసి అ చిత్ర హిందీ వెర్షన్ లో `భజ్ గయి గంటీ` అనే డైలాగ్ లో సెటైర్ వేశాడు.

చరణ్ లాగే ఎన్టీఆర్ కూడా భువన్ వేసిన సెటైర్ ని చాలా స్పోర్టీవ్ గా తీసుకుని నవ్వాడు. అయితే తన శక్తి గురించి ప్రస్తావన వచ్చిన సందర్భంలో చరణ్ నవ్వాడని కామెంట్ చేయడం నవ్వులు పూయించింది. అయితే భువన్ బాన్ `ఆర్ ఆర్ ఆర్ ` టీమ్ తో చేసిన ఇంటర్వ్యూని పూర్తిగా గమనిస్తే ఇది కావాలనే ప్రీ ప్లాన్డ్ గా చేసిన చిట్ చాట్ లా అనిపించిందని ఇందులో ప్రతీదీ స్క్రిప్టేని నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Star Maa Parivaar Awards 2024 – Promo | Most Awaited Celebration | Nagarjuna | Coming Soon

Posted : October 3, 2024 at 5:36 pm IST by ManaTeluguMovies

Star Maa Parivaar Awards 2024 – Promo | Most Awaited Celebration | Nagarjuna | Coming Soon

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad