Advertisement

మంచు మనోజ్ ‘హయ్యర్ పర్పజ్’ ఏంటి.?

Posted : March 21, 2022 at 3:20 pm IST by ManaTeluguMovies

సినీ నటుడు మంచు మనోజ్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి విషయంలో ఒకింత ఎమోషనల్ అయ్యారు. ‘మా’ ఎన్నికల వ్యవహారాన్ని ప్రస్తావించారు. తన అన్న మీద ఎవరెవరెవో ఏవేవో వ్యాఖ్యలు చేశారంటూ మండిపడిపోయారు. ‘హయ్యర్ పర్పజ్’ అంటూ మంచు మనోజ్, ఏదో చెప్పాలనుకుని.. ఇంకోటేదో చెప్పేసి.. అంతా గందరగోళం సృష్టించేశారు.

విద్యార్థులకు హయ్యర్ పర్పప్ వుండాలన్నది మంచు మనోజ్ ఉవాచ. విద్యార్థులకే కాదు ఎవరికైనా ఆ హయ్యర్ పర్పజ్ వుంటేనే ఉన్నత స్థానంలోకి వస్తారని సెలవిచ్చాడు మనోజ్. అంతేనా, ఆ హయ్యర్ పర్పజ్ లేనివారే, ఇతరులపై వివాదాస్పద వ్యాఖ్యలు, అభ్యంతకర వ్యాఖ్యలు, కుట్రలు చేస్తారని చెప్పుకొచ్చాడు మంచు మనోజ్.

పోనీ, మంచు మనోజ్ చెబుతున్నదే నిజమని అనుకుందాం. ఏ హయ్యర్ పర్పజ్‌తో ‘మా’ ఎన్నికల్ని అడ్డంపెట్టుకుని మెగా కుటుంబంపై అడ్డమైన వ్యాఖ్యలూ ‘మంచు’ కాంపౌండ్ నుంచి దూసుకొచ్చినట్టు.? అసలు చిరంజీవి పేరుని ఎందుకు వివాదాల్లోకి లాగినట్లు.

చిరంజీవినే హయ్యర్ పర్పజ్‌తో మంచు మనోజ్ తాజాగా టార్గెట్ చేశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ, మనోజ్ టార్గెట్ నాగబాబు. ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. నాగబాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నించారు, ప్రయత్నిస్తూనే వున్నారు.

నాగబాబు సినీ నటుడు, నిర్మాత కూడా. సరే, ఎవరికి వుండే ప్రత్యేకత వారికి వుంటుంది. నాగబాబు, ‘మా’ ఎన్నికల్లో గట్టిగా మాట్లాడారంటే, అంతకన్నా దారుణంగా ‘మంచు’ గ్రూపు నుంచి విమర్శలు దూసుకొచ్చాయి నాగబాబు మీదా, ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణుకి పోటీగా నిలబడిన ప్రకాష్ రాజ్ మీదా.

అది ఎన్నికల వ్యవహారం. ఎన్నికలయ్యాక ఎవరి పని వాళ్ళదే. ఆనాటి ఆ వ్యవహారాల్ని ఇప్పుడు కెలుక్కోవడం వెనుక మంచు మనోజ్ ‘హయ్యర్ పర్పజ్’ ఏంటన్నది ఆయనకే తెలియాలి. విద్యార్థులకు హయ్యర్ పర్పజ్ గురించి చెప్పాలనుకున్నప్పుడు, తమ లోయర్ పర్పజ్‌ని ఎందుకు బయటపెట్టుకున్నట్టు.?


Advertisement

Recent Random Post:

Road Accident at Vijayawada Highway : ఆగివున్న ట్రావెల్స్‌ బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Posted : November 2, 2024 at 11:43 am IST by ManaTeluguMovies

Road Accident at Vijayawada Highway : ఆగివున్న ట్రావెల్స్‌ బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad