Advertisement

పాన్ మసాలా బ్రాండ్ ను ప్రమోట్ చేసినందుకు సారీ చెప్పిన అక్షయ్ కుమార్

Posted : April 21, 2022 at 6:54 pm IST by ManaTeluguMovies

రీసెంట్ గా విమల్ ఎలాచి అనే పాన్ మసాలా బ్రాండ్ ను ప్రమోట్ చేసాడు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ప్రోడక్ట్ లను ప్రమోట్ చేయడం ఏంటని అక్షయ్ కుమార్ పై ఉవ్వెత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. చాలా మంది అక్షయ్ ను విమర్శించారు.

ఇవి అక్షయ్ వరకూ వెళ్లాయి. దీంతో అక్షయ్ వెంటనే స్పందించాడు. తాను అలాంటి బ్రాండ్ ను ప్రమోట్ చేసినందుకు సారీ అని క్షమాపణలు చెప్పాడు. ఇకపై తాను ఎంచుకునే ప్రోడక్ట్ ల విషయంలో జాగ్రత్తగా, బాధ్యతగా ఉంటానని చెప్పుకొచ్చాడు.

ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేసినందుకు గాను అందుకున్న పారితోషికాన్ని ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తానని తెలిపాడు. ఈ బ్రాండ్ తో దూరంగా ఉంటానని, కాకపోతే కాంట్రాక్ట్ ప్రకారం ఇంకా యాడ్స్ రావొచ్చని క్లారిటీ ఇచ్చాడు.


Advertisement

Recent Random Post:

The Prelude Of Kalki 2898 AD – Promo | Episode 1 (Telugu) | Nag Ashwin | Vyjayanthi Movies

Posted : June 18, 2024 at 2:54 pm IST by ManaTeluguMovies

The Prelude Of Kalki 2898 AD – Promo | Episode 1 (Telugu) | Nag Ashwin | Vyjayanthi Movies

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement