Advertisement

కేజీఎఫ్ సూపర్ స్టార్ కి నచ్చిందా? నచ్చలేదా?

Posted : April 22, 2022 at 5:29 pm IST by ManaTeluguMovies

యావత్ దేశం మొత్తం ఇప్పడు సలామ్ రాఖీభాయ్ అంటూ జేజేలు పలుకుతోంది. ఇటీవల విడుదలైన రాకింగ్ స్టార్ యష్ మూవీ ‘కేజీఎఫ్ 2’ దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ప్రశాంత్ నీల్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన హై వోల్టేజ్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ వసూళ్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. తొలి భాగం కన్నా చాప్టర్ 2 మరింత హై రేంజ్ లో వుండటంతో ఈ చిత్రం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. యష్ ఎలివేషన్స్.. అంతే కాకుండా భారీ యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాని ఓ రేంజ్ లో నిలబెట్టాయి.

దీంతో ఈ మూవీ యాక్షన్ ప్రియుల్నే కాకుండా సగటు ఆడియన్స్ కూడా రోమాంచిత అనుభూతికి లోనయ్యేలా చేస్తోంది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రం యునానిమస్ గా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అని తేల్చేశారు. యష్ నటన ప్రశాంత్ నీల్ టేకింగ్ రవి బాస్రూర్ బీజీఎమ్స్ భువన్ ట్రెమండస్ విజువల్స్ ఉజ్వల్ క్రిస్పీ ఎడిటింగ్ వెరసి సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రాఖీ భాయ్ పాత్రలో యాంగ్రీ యంగ్ మెన్ గా యష్ ప్రదర్శించిన నటపై కూడా విమర్శకులు సెలబ్రిటీలు ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా శుక్రవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ‘కేజీఎఫ్ 2’ టీమ్ పై సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇదొక టెర్రిఫిక్ మూవీ అని యష్ అద్భుతంగా నటించాడని అభినందనలు తెలియజేశాడు. ప్రభాస్ కూడా ఈ సినిమా విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇదిలా వుంటే ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ స్పందించకపోవడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.

గత కొంత కాలంగా ఏ సినిమా విడుదలై టెర్రిఫిక్ హిట్ గా నిలిస్తే సోషల్ మీడియా వేదికగా వారిపై మహేష్ ప్రశంసల వర్షం కురిపిస్తుండటం ఆనవాయితీగా మారింది. ఏ స్టార్ హీరో స్పందించినా స్పందించకపోయినా మహేష్ మాత్రం తప్పకుండా స్పందించి చిత్ర బృందాన్ని అభినందించేవాడు. కానీ ‘కేజీఎఫ్ 2’ పై ఇంత వరకు ఆయన నుంచి ఎలాంటి ట్వీట్ రాకపోవడంతో సోషల్ మీడియా వేదికగా పలువురు ఆసక్తికరమైన కామెంట్ లు చేస్తున్నారు.

మహేష్ కి ‘కేజీఎఫ్ 2’ నచ్చలేదని ఆ కారణంగానే ఆయన ఈ సినిమాపై ట్వీట్ చేయలేదని కొంత మంది కామెంట్ చేస్తుంటే మరి కొంత మంది మాత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లో మహేష్ బిజీగా వున్నారని ఆ కారణంగానే ఆయన ‘కేజీఎఫ్ 2’ గురించి స్పందించ లేదని అంటున్నారు.

అయితే మరో వర్గం మాత్రం ట్రిపుల్ ఆర్ పుష్ప చిత్రాల రిలీజ్ తరువాత వెంటనే మహేష్ నుంచి ఆయా చిత్రాలని ప్రశంసిస్తూ ట్వీట్ లు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. మరి కేవలం ‘కేజీఎఫ్ 2’ విషయంలో మాత్రం ఆయన స్పందించడం లేదని కామెంట్ లు చేస్తున్నారు. మరి ఈ కామెంట్ లపై మహేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.


Advertisement

Recent Random Post:

Jani Master Wife Ayesha Face To Face On Shrasti Varma And Jani Case

Posted : September 27, 2024 at 8:55 pm IST by ManaTeluguMovies

Jani Master Wife Ayesha Face To Face On Shrasti Varma And Jani Case

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad