Advertisement

‘బీస్ట్’ దెబ్బతో రజనీ వెనక్కి తగ్గుతున్నారా?

Posted : April 22, 2022 at 7:01 pm IST by ManaTeluguMovies

తలపతి విజయ్ కథానాయకుడిగా నటించిన ‘బీస్ట్’ ఇటీవలే విడుదలై ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సినిమా భారీ అంచనాల మధ్య భారీ ఎత్తున రిలీజ్ అయింది. కానీ మొదటి షోతోనే ‘బీస్ట్’ సత్తా తేలిపోయింది. నెగిటివ్ టాక్ తో ‘బీస్ట్’ విమర్శలు ఎదుర్కుంది. ఇప్పటివరకూ విజయ్ నటించిన ఏ సినిమాకి ఇంతటి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. ఆ రకంగా ‘బీస్ట్’ ఓ రికార్డు క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.

తమిళనాడులో మొదటి రెండు రోజులు ఊపు కనిపించినా తర్వాత అక్కడా ఒక్కసారిగా చల్లబడింది. అక్కడా అదే పరిస్థితి. అభిమానులు మనసులో వాపోవడం తప్ప బయటకి చెప్పలేని పరిస్థితి. వారంతంలోకి వచ్చేసరికి ‘బీస్ట్’ ని అందరించే వారు తమిళనాడులో కూడా కరువయ్యారు. అంత దారుణమైన ఫలితాన్ని ఆక్కడా సాధించిందని ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. మరి ఇంత రొటీన్ కథని విజయ్ ఎలా యాక్సెప్ట్ చేసాడు? అన్నది ఆయనకే తెలియాలి.

ఇప్పుడు ‘బీస్ట్’ ఇచ్చిన దెబ్బతో నెల్సన్ కి గట్టిగానే పంచ్ పడింది. ఆయన తదుపరి ప్రాజెక్ట్ డైలమాలో పడినట్లు సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడి నెల్సన్ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. రజనీకి స్ర్కిప్ట్ చెప్పి లాక్ చేసారు.

సన్ పిక్చర్స్ నే ఈ చిత్రాన్ని కూడా నిర్మించడానికి ముందుకొచ్చింది. బడ్జెట్ కూడా భారీగానే కేటాయించినట్లు సమాచారం. అయితే ‘బీస్ట్’ ఫలితంతో రజనీకాంత్-సన్ పిక్చర్స్ వెనక్కి తగ్గినట్లు కోలీవుడ్ మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి.

నెల్సన్ ని నమ్ముకుని రజనీకాంత్ రంగంలోకి దిగితే నట్టేట మునగడం ఖాయమని రజనీ ఆలస్యంగా రియలైజ్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీంతో నెల్సన్ ప్రాజెక్ట్ ని రద్దు చేసే దిశగా రజనీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అలాగే సన్ పిక్చర్స్ కూడా ఆ మేకర్ ని నమ్ముకుని సినిమా చేస్తే మరో ‘బీస్ట్’ అయితే పరిస్థితి ఏంటి? అని వెనక్కి తగ్గిందని ప్రచారం సాగుతోంది.

మరి ఇందులో వాస్తవం ఏంటి? అన్నది తెలియదు. నెల్సన్ తొలి సినిమా ‘కొలమావు కోకిల’ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తెరకెక్కించిన ‘డాక్టర్’ చిత్రంతోనూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ సక్సెస్ లు చూసే విజయ్ ‘బీస్ట్’ కి ఆఫర్ ఇచ్చారు. రజనీ ని లాక్ చేసే వరకూ వెళ్లారు.


Advertisement

Recent Random Post:

AP High Court to Deliver Verdict on Allu Arjun’s Quash Petition Today

Posted : November 6, 2024 at 1:47 pm IST by ManaTeluguMovies

AP High Court to Deliver Verdict on Allu Arjun’s Quash Petition Today

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad