Advertisement

దీపిక పదుకొణే చేతిలో ప్రెంచ్ బ్రాండ్!

Posted : May 13, 2022 at 12:16 pm IST by ManaTeluguMovies

దీపికా పదుకొణే స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ దాటి హాలీవుడ్ కి సైతం వెళ్లింది. ‘రిటర్న్స్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్’ దీపీక హాలీవుడ్ లో లాంచ్ అయి అక్కడ సత్తా చాటే ప్రయత్నం చేసింది. కానీ అటుపై హాలీవుడ్ లో ప్రియాంకచోప్రా మాదిరి కొనసాగలేదు. భారతీయ నటిగా ఇండియాలో ఉండటానికి ఇష్టపడింది. హిందీ సినిమాలతోనే బిజీ అయింది.

హాలీవుడ్ ప్రయత్నాలు కూడా విరమించుకుంది. రణవీర్ సింగ్ ని వివాహం చేసుకుని హిందీ సినిమా..ఫ్యామిలీ లైప్ కే ప్రాముఖ్యతనిచ్చి ముందుకెళ్తుంది. కానీ దీపికా పదుకొణేకి పాన్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడా క్రేజ్ తోనే మరో ప్రఖ్యాత బ్రాండ్ ని చేతిలో వేసుకుంది. ప్రెంచ్ లగ్జరీ ప్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ కు తాజాగా దీపిక బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. ఈ విషయాన్ని దీపిక ఇన్ స్టా ద్వారా అభిమానులకు షేర్ చేసింది.

ఈ పోస్ట్ ని ఉద్దేశించి దీపిక అభిమాని ఒకరు ఇలా రాసుకొచ్చారు. ఈ ఏడాది తన కెరీర్ లో మరో కొత్త మైలు రాయిని చేరుకుందని వ్యాఖ్యానించారు. ప్రెంచ్ బ్రాండ్ తో తన అగ్రిమెంట్ విషయాన్ని దీపిక వోగ్ మ్యాగజైన్ తో పంచుకుంది. 18 ఏళ్ల వయసు దగ్గర నుంచి మీరంతా సంపాదించడం మొదలు పెడతారు.

కానీ అంతకు ముందు ఈ స్టోర్ ని కనీసం చూడను కూడా చూడరు. ఎందుకంటే ఖరీదైన స్టోర్ లో వస్తువును కొనుగోలు చేయాలంటే దాని ధర కూడా అంతే ఉంటుంది.

ఇలాంటి వాటిల్లో కొన్ని మీరు ఆశించిన విధంగా అనుకూలంగా ఉంటాయి. కొన్ని కొన్ని మీ ఫరిదిలో లేకుండా పోతాయి. లూయిస్ విట్టన్ తో నా అనుబంధం రెండవసారి. ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను’ అని తెలిపింది. ప్రఖ్యాత లూయిస్ విట్టన్ లెదర్ బ్రాండ్ల కి అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న మొట్ట మొదటి భారతీయు నటి దీపిక పదుకొణే కావడం విశేషం. ఇంకా కొన్ని బ్రాండ్ లకు దీపికా ఎండార్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకూ బాలీవుడ్ నుంచి పలువురు నటులు విదేశీ లగ్జరీ బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరించారు. నటుడు షారూఖ్ ఖాన్ ‘ట్యాగ్ హ్యూయర్’ కి… హృతిక్ రోషన్ ‘స్విస్ వాచ్మేకర్ రాడో బివిల్’కి బ్రాండ్ అంబాసిడర్లగా ఉన్నారు. ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ కూడా వారి సరసన నిలిచారు.


Advertisement

Recent Random Post:

దువ్వాడ ప్రెస్ మీట్.. ఈ సారి నిజంగా రాజకీయమే!

Posted : November 23, 2024 at 9:51 pm IST by ManaTeluguMovies

దువ్వాడ ప్రెస్ మీట్.. ఈ సారి నిజంగా రాజకీయమే!

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad