యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో రూపొందిన శేఖర్ సినిమా విడుదల అయ్యింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా పెద్ద ఎత్తున మీడియా సమావేశాలు.. ఇంటర్వ్యూలకు రాజశేఖర్ హాజరు అయ్యారు. సినిమా విడుదల ముందు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రీమేక్ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రీమేక్ సినిమాలు చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి అన్నాడు. సినిమా లో హీరో పాత్ర నటీ నటుల పాత్రలు ఎలా ఉంటాయో ముందే తెలుస్తుంది.
తద్వారా మరింత బాగా నటించే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రీమేక్ లు అక్కడ హిట్ అయినా ఇక్కడ ప్లాప్ అవ్వడంకు కారణం పై ఆయన స్పందిస్తూ కొన్ని సార్లు మార్పులు చేయాల్సి ఉంటుంది.. కొన్ని సార్లు అలాగే ఉంచాల్సి ఉంటుంది. ముఖ్యంగా నేను శేషు సినిమా ను చేశాను. అది తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కడ విక్రమ్ కు అప్పుడు పెద్దగా స్టార్ డమ్ లేదు. కాని నేను ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా చేశాను. కాని నాకు ఇక్కడ ఉన్న ఇమేజ్ మరియు స్టార్ డమ్ వల్ల జనాలు ఆ సినిమాను ఆధరించలేదు. కనీసం నా ఇమేజ్ కు తగ్గట్లుగా క్లైమాక్స్ మార్చి ఉంటే బాగుండేది అనేది ఆయన అభిప్రాయం.