Advertisement

కేన్స్ ఉత్సవాల్లో తమన్నా ముద్దుల దాడి!

Posted : May 20, 2022 at 8:18 pm IST by ManaTeluguMovies

మిల్కీబ్యూటీ తమన్నా తొలిసారి కేన్స్ ఫిలిం పెస్టివల్స్ లో భాగమైన సంగతి తెలిసిందే. తమన్నాకి దక్కిన అరుదైన అవకాశం ఇది. దీంతో రెడ్ కార్పెట్ పై ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మొదటి రోజు యావరేజ్ మెరుపులు మెరిపించిన అమ్మడు డే బై డే షైన్ అవుతుంది. డిజైనర్ దుస్తుల్లో తనదైన మార్క్ తో అలరిస్తుంది.

కాగా మిల్కీబ్యూటీ థర్డ్ డే మాత్రం సమ్ థింగ్ స్పెషల్ గా రెడ్ కార్పెట్ పై హైలైట్ అయింది. తమన్నా ముద్దులతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసింది. జెన్నిఫర్ కన్నెల్లీ యొక్క టాప్ గన్ మావెరిక్ ప్రీమియర్ను జరుపుకోవడానికి సినిమా ప్రపంచం రెడ్ కార్పెట్పైకి దిగింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ నుండి పూజా హెడ్గే వరకు.. హెల్లీ షా నుండి తమన్నా భాటియా వరకు అందరూ గ్రాండ్ లో రెడ్ కార్పెట్ మీద నడిచారు.

తమన్నా మాత్రం కేవలం ముద్దులతోనే స్టన్ చేసింది. హాలీవుడ్..బాలీవుడ్ భామల్ని నిన్నటి రేసులో తమన్నా పక్కకు నెట్టేసింది. బ్లాక్ కలర్ డిజైనర్ దుస్తుల్లో తళుక్కున మెరిసింది. ఐశ్వర్యా రాయ్ వాక్ ఎప్పుడా అని ఎదురుచస్తున్నా? చూపరుల్ని సైతం తమన్నా వాక్ తో అటెన్షన్ డైవర్డ్ చేసింది. కేన్స్ పెస్టివల్ లో ఐశ్యర్యా రాయ్ ఎంట్రీ కి ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. కానీ తమన్నా ముందు ఐష్ సైతం నిలబడలేకపోయింది.

అమెరికన్ నటి ఎవా లాంగోరియాతో కలిసి పింక్ రంగులో ఐశ్వర్యా రాయ్ కనిపించింది. అయితే ఈసారి వేడుకల్లో ఐశ్వర్యారాయ్ అంత ఉత్సాహంగా కనిపించలేదు. మొక్కుబడిగానే మెరిసింది. నిన్నటి వాక్ అనంతరం ఐశ్వయర్యారాయ్ తిరిగి ఇండియాకి వచ్చేసింది. ఐశ్వర్యారాయ్ కుటుంబ సభ్యులతో హాజరైంది. అభిషేక్ బచ్చన్..ఆరాద్య బచ్చన్ వెంట ఉన్నారు.

కేన్స్ ఉత్సవాలు ఇంకా వారం రోజులు జరగనున్నాయి. దీంతో తమన్నా ఇంకెన్ని హైలైట్స్ ఇస్తుంది అన్న ఉత్సాహం అభిమానుల్లో రెట్టింపు అయింది. మరోవైపు తమన్నా నటించిన `ఎఫ్ -3` చిత్రం ఈనెల 27న రిలీజ్ కానుంది. ఇప్పటి వరకూ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో తమన్నా రెండు…మూడు రోజుల్లో ప్రాన్స్ నుంచి బయల్దేరుతుందని ప్రచారం సాగుతుంది.


Advertisement

Recent Random Post:

Rape Case Against Folk Singer Mallikteja

Posted : September 29, 2024 at 7:06 pm IST by ManaTeluguMovies

Rape Case Against Folk Singer Mallikteja

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad