Advertisement

రెమ్యునరేషన్ వద్దంటున్న ఎన్టీఆర్.. అన్న కోసమేనా?

Posted : May 21, 2022 at 3:58 pm IST by ManaTeluguMovies

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి దాదాపు నాలుగేళ్ల తర్వాత వచ్చిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మార్చి 25న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ అందించిన సక్సెస్ తో ఫుల్ జ్యోష్ లో ఉన్న ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ‘ఎన్టీఆర్ 30’ వర్కింగ్ టైటిల్ తో త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ వీడియోను బయటకు వదిలారు.

ఈ వీడియో అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులను సైతం విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్ ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు. ఎన్టీఆర్ 31 కి ప్రశాంత్ నీల్ దర్శకుడు అంటూ ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్నే నిజం చేస్తూ నిన్న ఈ సినిమాకు సంబంధించి అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేయడంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.

ఇకపోతే ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ వద్దన్నాడట. ‘ఆర్ఆర్ఆర్’ కు రూ. 45 కోట్ల మేర పారితోషికం అందుకున్నాడని వార్తలు రాగా.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కు రూ. 60 కోట్ల వరకు డిమాండ్ చేసే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం తన 30 31 ప్రాజెక్టులకు రెమ్యునరేషన్ వద్దని చెప్పినట్లు తాజాగా ఓ టాక్ బయటకు వచ్చి నెట్టింట వైరల్ గా మారింది.

ఆయన తన అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఎన్టీఆర్ ఇప్పటికే కళ్యాణ్ రామ్ ను తన సినిమాలకు పాట్నర్ గా చేసుకున్నాడు. కొరటాల శివ ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే రెండు చిత్రాల నిర్మాణంలోనూ కళ్యాణ్ రామ్ ప్రొడెక్షన్ హౌస్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ భాగం అయింది.

అయితే అన్నయ్య ప్రొడక్షన్ స్థాయిని పెంచడం కోసం ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కాకుండా బిజినెస్ లో షేర్ తీసుకోవాలని డిసైడ్ అయినట్లు జోరుగా టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

కాగా గతంలో కళ్యాణ్ రామ్ బ్యానర్ లో ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమా చేశాడు. ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. అయితే అన్నయ్యను నిర్మాతగా మరింత ప్రోత్సహించాలనే ఉద్ధేశంతో ఎన్టీఆర్.. తాను చేయబోమే ప్రతి సినిమాకు కళ్యాణ్ రామ్ ను సహనిర్మాతగా చేస్తున్నాడు. ఈ విషయం ఎన్టీఆర్ 30 31 ప్రాజెక్ట్ లతో స్పష్టం అయింది.


Advertisement

Recent Random Post:

ఏపీకి టాప్ క్లాస్ కంపెనీల క్యూ.. 5 నెలల్లోనే పెట్టుబడుల వరద – 2 States

Posted : November 12, 2024 at 10:00 pm IST by ManaTeluguMovies

ఏపీకి టాప్ క్లాస్ కంపెనీల క్యూ.. 5 నెలల్లోనే పెట్టుబడుల వరద – 2 States

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad