Advertisement

మరో రెండు నెలలు ఆగమంటున్న అనుష్క

Posted : May 30, 2022 at 10:03 pm IST by ManaTeluguMovies

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి బాక్సాఫీస్ సక్సెస్ చూసి చాలాకాలం అయింది. ఆమె తదుపరి సినిమా కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత అందులో నటించిన వారందరూ కూడా ఇండస్ట్రీలో బిజీగా మారుతుంటే అనుష్క మాత్రం ఇంకా తదుపరి ప్రాజెక్టుల విషయంలో నెమ్మదిగా అడుగులు వేస్తోంది. భాగమతి సినిమా తర్వాత ఆమె స్పీడ్ తగ్గింది.

మధ్యలో నిశ్శబ్దం అనే సినిమాతో ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. రిజల్ట్ పరంగా కూడా ఈ సినిమా నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కమర్షియల్ సినిమాలను పూర్తిగా దూరం పెట్టిన అనుష్క వీలైనంతవరకు కంటెంట్ ఉన్న మంచి కథలను సెలెక్ట్ చేసుకోవాలని డిసైడ్ అయింది.

అంతే కాకుండా తన పాత్ర కూడా రోటీన్ గా ఉండకూడదు అని ఆలోచిస్తోంది. ఇక ఈ బ్యూటీ త్వరలోనే యు.వి.క్రియేషన్స్ లో ఒక సినిమాను స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే.

P మహేష్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా కనిపించబోయే ఆ సినిమాలో అనుష్క శెట్టి హీరో కంటే పెద్ద వయసు ఉన్న అమ్మాయిగా కనిపిస్తుందట. వారిద్దరి మధ్య లో ఉండే ఒక వైవిధ్యమైన ప్రేమ కథ సినిమా లో కొనసాగుతుందట.

అయితే ఈ సినిమాలో పాత్ర కోసం అనుష్క శెట్టి బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. గతంలోనే ఈ బ్యూటీ కొన్ని విదేశాలకు కూడా వెళ్ళింది కానీ తను అనుకున్న షేప్ రాకపోవడంతో మళ్ళీ నిర్మాతలను మరికొంత సమయం అడిగినట్లు సమాచారం.

అసలైతే జూన్ మొదటి వారంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ అనుష్క శెట్టి రెండు నెలలు బరువు తగ్గడానికి సమయం కావాలి అని రిక్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక యూవీ క్రియేషన్స్ నిర్మాతలు కూడా అనుష్కకు అనువుగా ఉండే సమయంలోనే సినిమాను మొదలు పెట్టాలి అని మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


Advertisement

Recent Random Post:

Rajakili – Official Trailer | Samuthirakani | Thambi Ramaiah | Suresh Kamatchi | Dec 13th Release

Posted : November 21, 2024 at 1:07 pm IST by ManaTeluguMovies

Rajakili – Official Trailer | Samuthirakani | Thambi Ramaiah | Suresh Kamatchi | Dec 13th Release

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad