Advertisement

ఫొటో టాక్.. మనవళ్ళతో బాలయ్య బర్త్ డే

Posted : June 10, 2022 at 6:34 pm IST by ManaTeluguMovies

నందమూరి బాలకృష్ణ నేడు 62వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సినీ ప్రముఖులు అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా నందమూరి బాలకృష్ణ కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభిమానులకు ఎప్పటిలానే బాలయ్య బాబు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో మంచి కిక్ ఇచ్చారు. గోపీచంద్ మలినేని ప్రాజెక్టుకు సంబంధించిన టీజర్ గురువారం రోజు విడుదలైన విషయం తెలిసిందే.

బాలయ్య బాబును మరోసారి ఎలాగైతే చూడాలనుకుంటున్నామో అలాగే ఈ దర్శకుడు చూపిస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక బాలయ్య బాబు తన పుట్టిన రోజును ప్రతి ఏడాది కూడా కాస్త ప్రత్యేకంగానే జరుపుకుంటారు. ముందుగా ఆయన తన కుటుంబ సభ్యుల పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉంటారు.

అంతే కాకుండా ప్రతి పుట్టినరోజున బసవతారకం హాస్పిటల్ లో ఏదో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. అయితే బాలయ్య బాబు పుట్టినరోజు నాడు ఆయన మనవళ్ళు ఇద్దరు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ తో పాటు బాలయ్య బాబు చిన్న కూతురు కొడుకు కూడా తాత గారికి ప్రత్యేకంగా ఎన్.బి.కె అనే ఒక స్పెషల్ గిఫ్ట్ ను కూడా ఇచ్చారు. ఇక మనవాళ్ళతో బాలయ్య బాబు చాలా సంతోషంగా నవ్వుతూ ఫోటోకి స్టిల్ ఇచ్చారు.

ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పుట్టిన రోజున బాలయ్య బాబు ఈ ఫోటో తోనే హైలెట్గా కనిపించినట్లుగా అనిపిస్తోంది. ఇక బాలయ్య బాబు తదుపరి సినిమాల విషయానికి వస్తే గోపీచంద్ మలినేని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో తన 108 సినిమా తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా అఖండ సినిమాకు సీక్వెల్ లో బాలయ్య బాబు నటించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.


Advertisement

Recent Random Post:

బాలయ్యకు వైసీపీ చెమటలు పట్టిస్తోందా.? l Hindupuram l Balakrishna l CM YS Jagan l Off The Record

Posted : May 2, 2024 at 10:11 pm IST by ManaTeluguMovies

బాలయ్యకు వైసీపీ చెమటలు పట్టిస్తోందా.? l Hindupuram l Balakrishna l CM YS Jagan l Off The Record

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement