Advertisement

క్రేజీ కాంబోలో నాలుగో సినిమా ఇప్పట్లో సాధ్యమేనా..?

Posted : September 19, 2022 at 4:05 pm IST by ManaTeluguMovies

అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో #SSMB28 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే అప్పుడే త్రివిక్రమ్ తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో అనే చర్చలు మొదలయ్యాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో స్టార్ డైరెక్టర్ సినిమా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ లో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ లది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన వచ్చిన ‘జులాయి’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు మంచి విజయం సాధించాయి. ‘అల..’ అయితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అయితే దర్శక హీరోలు మరో మూవీ కోసం చేతులు కలపబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

నిజానికి త్రివిక్రమ్ – బన్నీ కాంబోలో నాలుగో ప్రాజెక్ట్ రానుందని కొన్ని నెలల క్రితమే వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఇరువురి మధ్య భేటీ జరిగిందని.. ఈ సందర్భంగా కథ గురించి చర్చలు జరిగాయని రూమర్స్ వస్తున్నాయి. మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందని అంటున్నారు.

బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడనికి రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే లోపు.. త్రివిక్రమ్ SSMB28 సినిమాని కంప్లీట్ చేయడమే కాదు.. బన్నీ స్క్రిప్ట్ మీద కూర్చుంటాడని అంటున్నారు.

అల్లు అర్జున్ పాన్ స్టార్ గా మారిన తర్వాత అనేకమంది అగ్ర దర్శకులు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ – కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ పలువురు ప్రముఖ దర్శకులు స్టోరీలు వినిపించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే బన్నీ వీరి కంటే ముందు త్రివిక్రమ్ సినిమాని చేస్తాడని పుకార్లు వినిపిస్తున్నాయి.

‘పుష్ప’ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ లైనప్ లో మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్ కొన్ని వెనక్కి వెళ్లిపోయాయి. ఒకవేళ ‘పుష్ప 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిస్తే.. బన్నీ ప్లానింగ్ లో చేంజెస్ చూడొచ్చు. అందుకే త్రివిక్రమ్ తో మూవీ ఎప్పుడు ఉంటుందో చెప్పలేమని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబోలో కచ్చితంగా మరో సినిమా ఉంటుందని.. కాకపోతే అది ఎప్పుడనేది ‘పుష్ప 2’ తర్వాతే తెలుస్తుందని అంటున్నారు. అయితే దసరా సందర్భంగా బన్నీ నెక్స్ట్ మూవీపై అధికారిక ప్రకటన ఉంటుందని ఆ మధ్య టాక్ నడిచింది. మరి త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

అజ్ఞాతంలోకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు | Pinnelli Ramakrishna Reddy Brothers | Macherla

Posted : May 17, 2024 at 6:35 pm IST by ManaTeluguMovies

అజ్ఞాతంలోకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు | Pinnelli Ramakrishna Reddy Brothers | Macherla

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement