Advertisement

బాహుబలి హీరోయిన్ అడ్డంగా బుక్ అయ్యింది

Posted : October 14, 2022 at 7:35 pm IST by ManaTeluguMovies

బాహుబలి సినిమా తో పాటు పలు హిందీ సినిమాల్లో మరియు సౌత్ సినిమాల్లో ప్రత్యేక పాటల్లో మరియు ముఖ్య పాత్రల్లో నటించిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ తనకు హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ సోషల్ మీడియా డీపీ అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అతడికి సోషల్ మీడియాలో అకౌంట్స్ లేవట.

ఇప్పటి వరకు అధికారికంగా సోషల్ మీడియా అకౌంట్ లను ఆయన మెయింటైన్ చేసిందే లేదు. మరి అలాంటప్పుడు ఎలా అతడి డీపీ అంటే ఇష్టం ఏర్పడింది అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ విషయంలో అంతా నోరా ఫతేహీ సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా అతడి పేరు మీద ఏమైనా ఫేక్ అకౌంట్ ఉండి ఉంటుంది ఆ ఫేక్ అకౌంట్ లో ఉన్న డిపి ని చూసి ఈమె పొరపాటు పడి ఉంటుంది.

అంత మాత్రానికి ఆమెను విమర్శించడానికి ఏమీ లేదని ఆమె ఈ విషయంలో క్లియర్ గా తెలుసుకోకుండా.. లోతుగా ఆలోచించకుండా సమాధానం చెప్పి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఉన్న ఈ అమ్మడిని అవమానించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ఆమెను ప్రశ్నిస్తూ ఉంటే మరికొందరు మాత్రం ఎవరి అభిప్రాయం వారిది అన్నట్లుగా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

మొత్తానికి ఈ బాలీవుడ్ ఐటమ్ సాంగ్ హీరోయిన్ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ అమ్మడు కాస్త జాగ్రత్తగా ఇకపై అయినా ప్రశ్నలకు సమాధానాలు చెప్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Advertisement

Recent Random Post:

వెహికల్‌ నెం. ప్లేట్లలతో పిఠాపురంలో హంగామా | Vehicle Number Plates | Pawan Kalyan Vs Vanga Geetha

Posted : May 31, 2024 at 12:44 pm IST by ManaTeluguMovies

వెహికల్‌ నెం. ప్లేట్లలతో పిఠాపురంలో హంగామా | Vehicle Number Plates | Pawan Kalyan Vs Vanga Geetha

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement