Advertisement

టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ విలన్ గా సత్యదేవ్?

Posted : October 15, 2022 at 7:13 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ సినిమాకి విలన్ల కొరత ఎప్పటి నుంచే ఉన్న సమస్య. దర్శకుల్ని మెప్పించే నటులు ఇక్కడ లేకపోడంతో పరాయి రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికీ అది కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగ సినిమాలో విలన్ అంటే బాలీవుడ్ నుంచి పట్టుకురావాల్సిన పరిస్థితి ఉంది. తెలుగు హీరోల్ని మ్యాచ్ చేసే విలన్లు అక్కడ మాత్రమే ఉన్నారు అన్నది మన దర్శకులు ఎంతో బలంగా నమ్ముతారు.

అప్పుడప్పుడు కొంత మంది తెలుగు నటులు ఆస్థానాన్ని భర్తీ చేసినప్పటికీ అది పుల్ ఫిల్ కావడం లేదు. ఆహార్యం పరంగానో..యాక్టింగ్ పరంగానో ఎక్కడో మిస్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇటీవల ఆ ఒరవడి కాస్త తగ్గింది. ఉత్తరాది కి బధులుగా సౌత్ నటుల్ని విలన్లగా దించుతున్నారు. కోలీవుడ్…మాలీవుడ్..శాండిల్ వుడ్ నటుల్ని తీసుకురావడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది.

ఔట్ ఫుట్ పరంగానూ ఉత్తరాది నటులుతో పోలిస్తే దక్షిణాది నటులు ఆయా పాత్రలకు పక్కాగా యాప్ట్ అవుతున్నారు. నటన పరంగా సహజత్వం కనిపిస్తుంది. దీంతో ఉత్తరాది నటుల హవా కాస్త తగ్గినట్లే కనిపిస్తుంది. మరి ఇప్పుడా ఇద్దరి నటుల స్థానాన్ని తెలుగు నటుడు సత్యదేవ్ కబ్జా చేయడం ఖాయమా? టాలీవుడ్ కి సిసలైన ప్రతి నాయకుడు దొరికేసినట్లేనా? స్టార్ హీరోలంతా ఇప్పుడతని చూజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయా? అంటే అవుననే చెప్పొచ్చు.

ఇటీవల రిలీజ్ అయిన ‘గాడ్ ఫాదర్’ లో జైదేవ్ దాస్ పాత్రలో ఒదిగిపోయిన వైనమే ఇంతటి చర్చకు దారి తీస్తుంది. సత్యదేవ్ లో అసలైన నటుడ్ని తమిళ దర్శకుడు మోహన్ రాజా గాడ్ ఫాదర్ చిత్రంతో బయటకు తీసారు. తెరపై సత్యదేవ్ నటన..డైలాగ్ డిక్షన్ ప్రతీది ఆకట్టుకుంటుంది. చిరంజీవి తో పోటా పోటీగా సాగిన పాత్రలో సత్యదేవ్ ఔరా అనిపించాడు.

ఇంకా చెప్పాలంటే? చిరు పాత్రకంటే సత్యదేవ్ పాత్ర మరింత ఫోకస్డ్ గా కనిపించింది. అతని డైలాగ్ డెలివిరీ..వాయస్.. వే ఆఫ్ ఎక్స్ ప్రెషన్స్ ప్రతీది సత్యదేవ్ ప్రతిభకు తార్కాణంగా చెప్పొచ్చు. తెలుగు లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా? అనిపిస్తుంది. చిరు పాత్రనే సత్యదేవ్ వాయిస్ తోనే డామినేట్ చేసాడని చెప్పొచ్చు. అతని లో ట్యాలెంట్ ని..ఉన్న క్వాలిటీల్ని మోహన్ రాజా తెలివిగా వినియోగించుకున్నారు.

తెరపై చూస్తున్నంత సేపు ఆ పాత్రకు సత్యదేవ్ తప్ప మరో నటుడు న్యాయం చేయలేడనిపించింది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి సత్యదేవ్ టాలీవుడ్ మోస్ట్ వాంటుడ్ విలన్ గా మారిపోతాడని పలువురు భవిష్యత్ చెబుతున్నారు. టైర్ వన్ హీరోలంతా అతన్ని విలన్ గా తీసుకునే ఛాన్స్ ఉందని బలంగానే వినిపిస్తుంది. మహేష్…ఎన్టీఆర్…ప్రభాస్.. రామ్ చరణ్..బన్నీ లాంటి హీరోలకు ప్రతినాయకుడి పాత్రలో సత్యదేవ్ కి నిలిచే అవకాశం ఉందంటారు.

హీరోలు..దర్శకులు సత్యదేవ్ ని వినియోగించుకోగల్గితే గనుక పక్క రాష్ర్టాల నటులపై ఆధారపడాల్సిన పని తగ్గుతుంది. తనలో నేచురల్ పెర్పార్మెన్స్ తోనే సాధించగలడని నిపుణులు అంచాన వేస్తున్నారు. ఇదంతా జరిగితే గనుక మెగాస్టార్ చిరంజీవి చలవే అనే భావించాలి. ఎందుకంటే అతనిలో ఆ ప్రతిభను గుర్తించి గాడ్ పాదర్ లో అవకాశం కల్పించి అతనే. సత్యదేవ్ లో వాయిస్..లుక్ మెగాస్టార్ ఆకట్టుకున్నాయి. ‘బ్లఫ్ మాస్టర్’ లో అతని నటన చూసి కల్పించిన అవకాశం ఇది.


Advertisement

Recent Random Post:

Prakash Raj Sensational Tweet On Deputy CM Pawan Kalyan | Hero Karthi

Posted : September 25, 2024 at 10:01 pm IST by ManaTeluguMovies

Prakash Raj Sensational Tweet On Deputy CM Pawan Kalyan | Hero Karthi

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad