Advertisement

కుమార్తెలు తల్లిదండ్రుల్లా ఊపు తేలేకపోతున్నారే!

Posted : June 30, 2023 at 9:39 pm IST by ManaTeluguMovies

వెటరన్ నటి రాధ…యాక్షన్ కింగ్ అర్జున్ నటులుగా ఎంత ఫేమస్ అయ్యారో చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు తెలుగు వారు కాకపోయినా! టాలీవుడ్ వాళ్లని సొంత భాషా నటుల్లా ఆదరించింది. ఎన్నో సినిమాల్లో నటించి దక్షిణాది పరిశ్రమలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. ఇక మెగా నిర్మాత నాగబాబు నటుడిగా సక్సెస్ కానప్పటికీ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా…పవన్ కళ్యాణ్ అన్నయ్యగా బాగా ఫేమస్.

నిర్మాతగా పలు సినిమాలు నిర్మించి తన ప్రత్యేకతని చాటుకున్నారు. అలాగే బుల్లి తెర కామెడీ షోలకు హోస్ట్ గాను వ్యవహరించారు. కుమారుడు వరుణ్ తేజ్ హీరో అయిన తర్వాత నాగబాబు ఇంకా ఫేమస్ అయ్యారు.

అయితే వీళ్లందరి కుమార్తెలు మాత్రం పరిశ్రమలో ఆశించిన స్థాయిలో ఇంకా రాణించలేదనే తెలుస్తోంది. రాధ కుమార్తెలు కార్తిక..తులసీ ఇద్దర్ని హీరోయిన్లగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ‘జోష్’ తో పరిచయమైన కార్తిక కొన్నాళ్లకే సినిమాలకు దూరమైంది.

ఇక చిన్న కుమార్తె తులసి కూడా రెండు సినిమాల తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. అర్జున్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య కూడా హీరోయిన్ గా రాణించాలని చాలా ప్రయత్నాలు చేసింది. కన్నడ లో కొన్ని సినిమాల అనంతరం తెలుగులోనూ లాంచ్ చేయాలని ఓ సినిమా చేసారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఆ బ్యూటీ ప్రేమ పాఠాలు నేర్చుకుంటుంది. త్వరలో ప్రేమించిన చెలికాడిని పెళ్లి చేసుకుంటుందని తెలుస్తోంది.

కెరీర్ పరంగా ఎలాండి డెవలెప్ మెంట్ లేదు. మెగా డాటర్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కెరీర్ కూడా నత్తనడకే సాగుతుంది. బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చిన నిహారిక అటుపై పెద్ద తెరకు ప్రమోట్ అయింది.

కానీ ఏ దశలోనూ బిజీ కాలేదు. ఆ తర్వాత వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. దీంతో నిహారిక కెరీర్ ముగ సిందనుకున్నారంతా. ఈ మధ్యనే మళ్లీ వెబ్ సిరీస్ లు..నటన అంటూ కనిపిస్తుంది. కానీ అనుకున్న రేంజ్ లో ఇంకా సక్సెస్ రాలేదు.


Advertisement

Recent Random Post:

Star Maa Parivaar Awards 2024 – Promo | Most Awaited Celebration | Nagarjuna | Coming Soon

Posted : October 3, 2024 at 5:36 pm IST by ManaTeluguMovies

Star Maa Parivaar Awards 2024 – Promo | Most Awaited Celebration | Nagarjuna | Coming Soon

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad