Advertisement

శివ కార్తికేయన్ అన్న సర్ ప్రైజ్ ఇదేనా..?

Posted : July 12, 2023 at 8:57 pm IST by ManaTeluguMovies

యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి చిన్న చిన్న పాత్రలు వేసి ఆ తర్వాత హీరోగా మారాడు తమిళ నటుడు శివ కార్తికేయన్. కోలీవుడ్ లో డిఫరెంట్ కథలతో యూత్ ఆడియన్స్ ని అలరిస్తున్న అతను అక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అక్కడే కాదు శివ కార్తికేయన్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ ఇక్కడ కూడా ఫ్యాన్స్ ని ఏర్పర్చుకున్నాడు శివ కార్తికేయన్. రెమో వరుణ్ డాక్టర్ కాలేజ్ డాన్ సినిమాలతో తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అందుకున్నాడు శివ కార్తికేయన్.

జాతిరత్నాలు అనుదీప్ తో ప్రిన్స్ సినిమా చేసిన శివ కార్తికేయన్ ఆ సినిమా మాత్రం సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా మహావీరుడు సినిమాతో మరోసారి తన లక్ టెస్ట్ చేసుకోవాలని చూస్తున్నాడు శివ కార్తికేయన్. అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మరో రెడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శివ కార్తికేయన్ మహా వీరుడులో మరో స్పెషల్ సర్ ప్రైజ్ ఉంది. అదే ఈ సినిమాకు మన మాస్ మహారాజ్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే.. రీసెంట్ గా మహ వీరుడు ఈవెంట్ లో శివ కార్తికేయన్ ఈ సినిమాలో మరో స్పెషల్ థింగ్ ఉందని అదేంటి అన్నది మరో రెండు రోజుల్లో చిత్ర యూనిట్ అనౌన్స్ చేస్తుందని అన్నారు.

సో ఆరోజు శివ కార్తికేయన్ ఇచ్చిన హింట్ రవితేజ వాయిస్ ఓవర్ గురించేనా అని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఇక రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తే సినిమా సూపర్ హిట్ అన్నట్టే లెక్క. ఇదివరకు రవితేజ సునీల్ హీరోగా నటించిన మర్యాద రామన్న సినిమాలో సైకిల్ కి వాయిస్ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

నాని నిర్మించిన అ! సినిమాలో కూడా ఒక మొక్కకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు రవితేజ. ఆ సినిమా కూడా సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు శివ కార్తికేయన్ సినిమాకు కూడా వాయిస్ ఓవర్ అందించాడు. తప్పకుండా రవితేజ వాయిస్ ఓవర్ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

శివ కార్తికేయన్ మహావీరుడు ఫాంటసీ కథతో వస్తుంది. శివ కార్తికేయన్ సరసన అదితి శంకర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆడియన్స్ కు ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని అంటున్నారు. జూలై 14న శివ కార్తికేయన్ మహా వీరుడుతో పాటుగా ఆనంద్ దేవరకొండ బేబీ మామన్నన్ తెలుగు డబ్బింగ్ వర్షన్ నాయకుడు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల్లో ఏది సక్సెస్ అందుకుంటుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

కొత్త టర్న్‌ తీసుకున్న కొండా సురేఖపై ట్రోలింగ్‌ వ్యవహారం

Posted : October 3, 2024 at 2:41 pm IST by ManaTeluguMovies

కొత్త టర్న్‌ తీసుకున్న కొండా సురేఖపై ట్రోలింగ్‌ వ్యవహారం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad