Advertisement

టైగర్ (Vs) పఠాన్.. వై క‌ట్ట‌ప్ప కిల్డ్ బాహుబ‌లి టైప్‌లో..!

Posted : August 1, 2023 at 10:12 pm IST by ManaTeluguMovies

దేశీ స్పై యూనివ‌ర్శ్ చిత్రాల‌తో ప్ర‌తిష్ఠాత్మ‌క YRF భారీ సంచ‌ల‌నాల‌కు తెర తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ ఫ్రాంఛైజీలో ‘టైగర్ (Vs) పఠాన్’ చిత్రాన్ని దేశంలోని ఇద్ద‌రు అగ్ర హీరోల‌తో తెర‌కెక్కిస్తామ‌ని ప్ర‌క‌టించ‌గానే స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఈ ప్రాజెక్ట్ చుట్టూ చాలా సంచలన విష‌యాలు ఉన్నప్పటికీ YRF పెదవి విప్పడంలేదు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ భారీ స్పై యూనివర్స్ ప్రాజెక్ట్ షూటింగ్ 2024 జనవరిలో ప్రారంభం కానుంది. చిత్రనిర్మాత ఆదిత్య చోప్రా ఈ ప్రాజెక్ట్ కి తెలివైన ప్ర‌మోష‌నల్ పాథ్ ని రెడీ చేస్తున్నార‌ని తాజాగా లీక్ అందింది.

క్రేజీ స్పై యూనివ‌ర్శ్ లో త‌దుప‌రి చిత్రం టైగర్ 3లో ‘టైగర్ వర్సెస్ పఠాన్’ థ్రిల్లింగ్ టీజ్‌ను పరిచయం చేయబోతున్నట్లు గుసగుస‌లు వినిపిస్తున్నాయి. టీజింగ్ షాట్ లో భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లోని ఇద్దరు దిగ్గజాలు సల్మాన్ ఖాన్ – షారూఖ్ ఖాన్ క్లిష్టమైన పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడటానికి పోరాడ‌తార‌ని తెలిసింది. పఠాన్‌లో సల్మాన్ – ఎస్‌ఆర్‌కె సహకారాన్ని ఆటపట్టించినట్లే.. టైగర్ 3లో ఆదిత్య చోప్రా ‘టైగర్ వర్సెస్ పఠాన్’ గురించి సూచించే క్రేజీ స‌న్నివేశాన్ని తెర‌పై చూపిస్తార‌ని సోర్స్ చెబుతోంది.

YRF స్పై యూనివర్స్ ‘టైగర్’ ఫ్రాంచైజీతో ప్రారంభమైంది. ఇందులో సల్మాన్ ఖాన్ – కత్రినా కైఫ్ నటించిన ఏక్ థా టైగర్ (2012) – టైగర్ జిందా హై (2017) సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. దీని తర్వాత హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ నటించిన వార్ (2019) భారీ విజ‌యం అందుకుంది. స్పై విశ్వానికి ఇటీవలి చేరిక ఈ సంవత్సరం ప్రారంభంలో విడుద‌లైన‌- పఠాన్. ఇప్పుడు ‘టైగర్ 3’ ఇదే యూనివ‌ర్శ్ నుంచి వ‌స్తోంది. ఈ దీపావళికి థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.

యూనివర్స్‌లోని ప్రతి చిత్రం తదుపరి పెద్ద ప్రాజెక్ట్‌ గురించి ఇండికేష‌న్ ఇస్తుంద‌ని.. అభిమానులను ఊహాగానాల్లో ఉంచుతూ చర్చల్లో నిమగ్నమయ్యేట్టు చేస్తార‌ని భావిస్తున్నారు. Why Kattappa killed Baahubali? (క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు?) త‌ర‌హాలో ఒక ప్ర‌శ్న ప్రేక్ష‌కుల మదిలో మెదిలేట్టు ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

వైఆర్ఎఫ్ స్టూడియో తన టైటిళ్ల‌ను చాలా ముందే మార్కెట్ చేయడానికి YRF చిత్రాల అభిమానులతో పాటు హిందీ ప‌రిశ్ర‌మ‌ అతిపెద్ద సూపర్‌స్టార్‌ల అపారమైన అభిమానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోనుంది. ఈ వ్యూహం ప్రతి YRF స్పై యూనివర్స్ చిత్రం చుట్టూ భారీ హైప్ తో సందడికి తెర‌లేపుతుంద‌ని భావిస్తున్నారు. త‌దుప‌రి విడుద‌ల‌కు రానున్న ‘టైగ‌ర్ 3’ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు.

ఆదిత్య చోప్రా నిర్మించారు. YRF స్పై యూనివర్స్‌లో ఐదవ సినిమా. టైగర్ జిందా హై (2017)కి సీక్వెల్‌గా వ‌స్తోంది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ త‌దిత‌ర భారీ తారాగ‌ణం నటించారు. ప్ర‌స్తుతానికి అభిమానులు ‘టైగర్ 3’ అందించనున్న గ్రాండ్ సినిమాటిక్ అనుభవం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Super Star Rajinikanth Discharged From Hospital in Chennai |

Posted : October 4, 2024 at 2:11 pm IST by ManaTeluguMovies

Super Star Rajinikanth Discharged From Hospital in Chennai |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad