Advertisement

ఆ సీన్స్ చేయ‌క‌పోతే ఆంటీని చేసేస్తారు: త‌మ‌న్నా

Posted : August 5, 2023 at 10:23 pm IST by ManaTeluguMovies

సుమారు రెండు ద‌శాబ్ధాల సుదీర్ఘ‌మైన ఇన్నింగ్స్ ని సాగించింది తమన్నా భాటియా. తెలుగు-త‌మిళం-హిందీ భాష‌ల్లో న‌టిగా కొన‌సాగుతోంది. ముంబై టు హైద‌రాబాద్ త‌న జ‌ర్నీ ఎంతో ఆస‌క్తిక‌ర‌మైన‌ది. చెన్నై- ముంబై ప‌రిశ్ర‌మ‌ల్లోను మిల్కీ వైట్ బ్యూటీ కి బోలెడంత ఫాలోయింగ్ ఉంది. ఇప్ప‌టికీ తెలుగు త‌మిళ సినీప‌రిశ్ర‌మ‌ల‌తో త‌మ‌న్నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్క‌డ అగ్ర హీరోల స‌ర‌స‌నా ఆడిపాడుతోంది. నేటిత‌రం నుంచి ఎంత‌గా పోటీ ఉన్నా కానీ సీనియ‌ర్ హీరోల‌కు త‌మ‌న్నా యాప్ట్ కావ‌డంతో వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికిప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ల స‌ర‌స‌న న‌టించిన సినిమాలు రిలీజ్ ల‌కు రెడీ అవుతుండ‌గా ఈ రెండిటిలో న‌టించిన‌ త‌మ‌న్నా స్పెష‌ల్ ట్రీట్ గురించి యూత్ లో చ‌ర్చ సాగుతోంది.

త‌మ‌న్నా న‌టించిన జైల‌ర్ – భోళాశంక‌ర్ చిత్రాలకు ప్ర‌చారం స్పీడందుకుంది. తాజాగా మీడియా స‌మావేశంలో త‌మ‌న్నా ఘాటైన ఇంటిమేట్ స‌న్నివేశాల గురించి మాట్లాడింది. హీరోల‌తో ఘాటైన‌ సన్నివేశాలలో నటించడం గురించి మాట్లాడుతూ కొత్త తరాన్ని ల‌క్ష్యం చేసుకుని అలాంటి సీన్స్ చేస్తామ‌ని తెలిపింది.

వారిని మెప్పించడానికి అంచనాలకు తగ్గట్టుగా ఇంటిమేట్ సీన్స్ చేయడానికి ఒప్పుకోవాలని తమన్నా అన్నారు. ఒకవేళ తాను అలాంటి సన్నివేశాల్లో నటించడానికి అంగీకరించకపోతే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తనను యువ హీరోల పక్కన చెల్లెలు లేదా ఆంటీ పాత్రలకు ఎంపిక చేస్తారని కూడా చెప్పింది. ఇటీవ‌ల త‌మ‌న్నా వ‌రుసగా వెబ్ సిరీస్ ల‌కు సంత‌కాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

విజ‌య్ వ‌ర్మ‌తో క‌లిసి ఘాటైన శృంగార స‌న్నివేశాల్లో న‌టించిన త‌మ‌న్నా త‌దుప‌రి సినిమాలపైనా ఫోక‌స్ పెట్టింది. మాస్ ఆడియన్స్‌ని ఆకర్షించడానికి మరిన్ని వెబ్ డ్రామాలతో పాటు కమర్షియల్ సినిమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తమన్నా తాజా ఇంట‌ర్వ్యూలో తెలిపింది. ర‌జ‌నీ స‌ర్ తో జైల‌ర్ .. చిరుతో భోళా శంక‌ర్ చిత్రాల్లో న‌టించిన త‌మ‌న్నా ఈ రెండు సినిమాలు విజ‌యం సాధిస్తాయ‌న్న ధీమాను క‌న‌బ‌రుస్తోంది.


Advertisement

Recent Random Post:

PM Modi Call Mallikarjun Kharge after Congress President falls ill at J-K poll Rally

Posted : September 30, 2024 at 12:03 pm IST by ManaTeluguMovies

PM Modi Call Mallikarjun Kharge after Congress President falls ill at J-K poll Rally

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad