Advertisement

ఆ బాధ్యతతోనే సినిమాలు చేస్తున్నా : వరుణ్ తేజ్

Posted : August 18, 2023 at 9:43 pm IST by ManaTeluguMovies

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా గాండివధారి అర్జున. ఈ సినిమా నెక్స్ట్ వీక్ థియేటర్ లోకి వస్తుంది. వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్యా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను ఎస్.వి.సి.సి బ్యానర్ లో బోగవల్లి ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. వరుణ్ తేజ్ కెరీర్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా గాండివధారి అర్జున. సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అంచనాలు పెంచగా సినిమా తప్పకుండా ఆడియన్స్ అంచనాలకు తగినట్టుగా ఉంటుందని అంటున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ సినిమా కథ కొంత మేరకు రివీల్ చేశారు. సినిమాలో తన పాత్ర చాలా బాగుంటుందని.. నాజర్ కి బాడీ గార్డ్ గా ఉన్న తాను డ్యూటీ ఎలా చేశానని. ఆ ప్రయత్నంలో తనకు వచ్చిన కొన్ని సమస్యల నుంచి ఎలా బయటపడ్డాను అన్నదే కథ అని చెప్పారు. ప్రతి సినిమాతో ఏదో ఒక కొత్త ప్రయత్నం చేయడమో లేక ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పడమో అలవాటు చేసుకున్నానని. అది తన బాధ్యత అని అన్నారు వరుణ్ తేజ్. మెగా కాంపౌండ్ హీరో కాబట్టి కమర్షియల్ సినిమాలతో కెరీర్ ని లాగించొచ్చు కానీ వరుణ్ తేజ్ కథల సెలక్షన్స్ లో తన ప్రతిభ చూపిస్తున్నాడు.

ఒకే తరహా కథలతో సినిమాలు చేస్తూ ఒక మూసలో వెళ్లకుండా డిఫరెంట్ కథలతో ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నాడు వరుణ్ తేజ్. అందుకు తగినట్టుగానే తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. గాండివధారి అర్జున సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా భారీగా తెరకెక్కుతుంది. మెగా హీరోగా తన మార్క్ నటనతో ఫ్యాన్స్ ని అలరిస్తూ వస్తున్న వరుణ్ తేజ్ ఈమధ్యనే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇద్దరు కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు.

ఆ టైం లోనే ఇద్దరు క్లోజ్ అయ్యారు. ఆ టైం నుంచి ప్రేమలో ఉంటూ రీసెంట్ గా పెద్దలను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు. ఎంగేజ్మెంట్ తర్వాత ఇద్దరు కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ పెళ్లి డేట్ ఇంకా లాక్ అవలేదు. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఇటలీలో వీరి మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.


Advertisement

Recent Random Post:

The Sounds of Game Changer – Vol 2 | Dil Raju X Anantha Sriram | Ram Charan | Thaman S

Posted : October 1, 2024 at 1:52 pm IST by ManaTeluguMovies

The Sounds of Game Changer – Vol 2 | Dil Raju X Anantha Sriram | Ram Charan | Thaman S

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad