Advertisement

జవాన్ బాక్సాఫీస్.. ముందస్తు హెచ్చరిక

Posted : September 5, 2023 at 10:00 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జవాన్. ఈ మూవీ పై మొదటి నుంచి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. తీరా, ట్రైలర్ విడుదలయ్యాక, ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ క్రమంలో ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేసే పనిలో పడింది. మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది అనగా, అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు.

అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావడంతో, అభిమానులు రెచ్చిపోతున్నారు. విపరీతంగా మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా టికెట్స్ బుక్ అవుతుండటం విశేషం. ఈ స్పందనకు మూవీ టీమ్ ఆనందంలో మునిగి తేలుతోంది.

ఈ బుకింగ్స్ చూస్తుంటే, పఠాన్ కి మంచిన హిట్ షారూక్ జవాన్ తో అందుకునే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పఠాన్, గదర్ 2 కంటే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్ ఈ సినిమాకే నమోదు కావడం విశేషం. అడ్వాన్స్ బుకింగ్ బిజినెస్ లో గదర్ 2ని జవాన్ అధిగమించడం విశేషం. ఈ క్రమంలో ఓపెనింగ్స్ అదరిపోతాయని మూవీ టీమ్ భావిస్తోంది. ఈ మూవీలో షారూక్ ని చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే విషయం అర్థమౌతోంది.

పఠాన్ మూవీ దేశవ్యాప్తంగా రూ.57కోట్ల నికర లాభంతో ప్రారంభమైంది. ఇప్పుడు జవాన్ దానికి మించేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 7వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, సెప్టెంబర్ 5 వ తేదీ ఉదయం 6 గంటల నాటికి ఏడు లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.

ఈ జవాన్ మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ఆయన లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ సినిమాని రెడ్ చిల్లీస్ ఎంటర్ ట్రైన్మెంట్ బ్యానర్ పై షారూక్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తుండటం విశేషం.ఈ మూవీ వివిధ భాషల్లో పాన్ ఇండియా మూవీ గా విడుదలౌతోంది.


Advertisement

Recent Random Post:

Balineni Srinivas Reddy : జనసేనకు బాలినేని తలనొప్పిగా మారుతాడా..?

Posted : September 20, 2024 at 12:07 pm IST by ManaTeluguMovies

Balineni Srinivas Reddy : జనసేనకు బాలినేని తలనొప్పిగా మారుతాడా..?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad